మందేసి చిందేసిన .. మోడల్ .. కిక్కు బాగా ఎక్కేసినట్టుంది..

మహిళా స్వాతంత్రం, ప్రస్తుత ప్రపంచంలో ఇది చాలా పెద్ద డిమాండ్. దానికోసం చాలా మంది ప్రాణాలు పెట్టి మరి పోరాడుతున్నారు. కనీస స్వేచ్ఛ లేని ప్రాణాలుగా జీవించడానికి తామేమి వస్తువులము కాదని వారు మొత్తుకుంటున్నారు. కనీసం నేటి ప్రపంచం వస్తువులను ప్రేమించినంతగా తోటి మనుషులను కూడా పట్టించుకోవడం లేదు. ఎంతో సాంకేతిక పురోగతి సాధించాము అని చెప్పుకుంటున్న ప్రపంచం కాస్తైనా తమ గురించి ఆలోచించారా అంటూ ప్రశ్నిస్తుంటే, దానికి చాలా దేశాలు ఇంకా సమాధానం చెప్పలేక పోతున్నాయి. అయినా ఉన్న కొద్ది స్వాతంత్రం తో ఇప్పటికే అనేక రంగాలలో మహిళలు దూసుకుపోతూనే ఉన్నారు. తాజాగా భారత ప్రభుత్వం కూడా రక్షణశాఖలో మహిళలకు స్థానాన్ని కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది.
ఇలా ప్రపంచంలో గొప్ప పోరాటాన్ని నీరుగారుస్తూ  కొందరి మహిళల ప్రవర్తన ఉంటుంది. పురుషుల కంటే అన్నిటిలో గొప్పవాళ్ళం అని నిరూపించుకోడానికి హద్దు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇరువురు సమానం అనే కదా నిరూపించుకోవాల్సింది, కానీ దానినే మరిచిపోయి అదికులం అనిపించుకోడానికి లేనిపోని పాశ్చాత్య అలవాట్లను చేసుకుంటూ, తాను చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందన్నట్టు, వారితో పాటుగా వారి తో ఉన్నవారికి కూడా చెడ్డపేరు తెచ్చిపెడుతున్నారు. వీళ్ళను చూసి, మహిళలకు స్వాతంత్రం ఇస్తే ఇలాగె అయిపోతారేమో అనే సందేహంతో ఇప్పుడే మార్పు గురించి ఆలోచిస్తున్న వారిలో వెనకడుగు పడేట్టు చేస్తుంది.
తాజాగా ఒక మోడల్ తప్పతాగి రోడ్డుపైకి వచ్చి సరాసరి దేశమే గౌరవిస్తున్న ఆర్మీ వాహనంపై వీరంగం చేసింది. ఆమె ఈ ప్రవర్తన తనతో పాటు తన వారి విలువను కూడా తగ్గించేస్తుంది. మహిళల స్వేచ్చకు ఇలాంటి గొడవలు అడ్డుగా నిలుస్తున్నాయంటూ సామజిక మాధ్యమాలలో చర్చించుకుంటున్నారు. ఒక మహిళ ఇలా ప్రవర్తిస్తుందంటే ఆమె లో ఎదో అంతర్మధనం జరుగుతుందని తెలుస్తుంది కానీ, దానిని ఇలా వ్యక్త పరిస్తే ఎవరికి మాత్రం అర్ధం అవుతుంది. అర్ధం కాకుండా ఎలా పరిష్కారం దొరుకుతుంది. లింగభేదాలు లేకుండా ప్రతివారు స్వీయ క్రమశిక్షణతో బ్రతకడమే నిజమైన స్వేచ్ఛ అని పెద్దలు చెప్పిన మాట ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకొనితీరాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: