లైఫ్ స్టైల్ : ఇంట్లో వుండే నెగిటివ్ ఎనర్జీ ని తొలగించండిలా..

Divya
సాధారణంగా వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చేరకుండా ఉండాలంటే, ఇల్లు నిర్మించేటప్పుడే , వాస్తు ని బట్టి గృహాన్ని నిర్మించుకోవాలని చెబుతూ ఉంటారు. అలా ఎవరైతే వాస్తు శాస్త్రాన్ని ఉపయోగించి , వాస్తు ప్రకారం ఇంటి నిర్మించుకుంటారో, అలాంటి వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు కానీ కుటుంబ కలహాలు కానీ, ఇంట్లో అనారోగ్య సమస్యలు కానీ దరిచేరవు. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి నిర్మించుకోవడం వల్ల ఆర్థికంగా, కుటుంబం పరంగా , ఆయురారోగ్యాలతో ఎప్పుడు శాంతిగా ఉంటుంది. ఒక్కోసారి మనం ఇంట్లో వాస్తు శాస్త్రం ప్రకారం పాటించకపోతే, ఇంటిలోకి అశాంతి చేకూరుతుంది. అయితే ఇంటిలో ఉండే దుష్టశక్తులను, నెగిటివ్ ఎనర్జీని పారద్రోలాలంటే, ఏం చేయాలో..? ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటిలోని కుటుంబ సభ్యులు సూర్యోదయం ముందుగానే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులకు ఆహ్వానం పలికినట్లు అవుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందవచ్చు.
మన ఇంటిలో పూజ గది అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. కాబట్టి పూజగదిలో దేవుని విగ్రహాలు లేదా పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంచకూడదు.
పూజ గదిలో విలువైన వస్తువులను దాచుకోవడం, ఉత్తర దిక్కుకు  ఎదురుగా ఉంచుకోవడం వంటివి చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోతారు.
ఇక ఇంటిలో శాంతి చేకూరాలి అంటే, నెయ్యితో దీపం వెలిగించాలి. అలాగే పొద్దున , సాయంత్రం కూడా దీపారాధన చేయడం వల్ల ఇంట్లో దేవతలు కొలువై ఉంటారు.
ఇంటిలో ఒకవేళ వాస్తు దోషం ఉన్నట్లు అయితే, అది ఇంటి పెద్దపై ఆ దోషం పడుతుంది. కాబట్టి ఇంటి పెద్దలు సాత్ముఖి  రుద్రాక్ష ధరించడం వల్ల వారికి ఆయురారోగ్యంతో పాటు దీర్ఘాయువు కూడా ఉంటుంది.

తినేటప్పుడు ఎక్కువగా మాట్లాడటం, వాదనలు చేయడం వంటివి చేయరాదు. ఇంకా అంతే కాదు దక్షిణ ద్వారం వైపు ఇంటిని నిర్మించుకోరాదు  ఒకవేళ అలా దక్షిణద్వారం ఉన్నట్లయితే, ఇంటి ముందు వినాయక చిత్రపటం ఉంచుకోవడం ఉత్తమం. ఇక ఈ పద్ధతులను పాటించడం వల్ల ఇంట్లో శాంతి చేకూరడడంతో పాటు  ఇంట్లోని వాళ్ళు ఆయురారోగ్యాలతో , అష్టైశ్వర్యాలతో తులతూగుతూ వుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: