మనశ్శాంతి గా ఉండటానికి, మీ ఇంటిలో ఈ విధంగా చేయండి..?చికాకులు ఉండవు..!

kalpana
మనము డబ్బు ఎంత సంపాదించినా, ఇంటిలో మనశ్శాంతి ఉండదు.చికాకుగా ఉంటారు. ఇప్పుడు కోపం గాను ఉంటారు.ఎన్ని పోవడానికి కొన్ని చిన్న మార్పులు చేసుకోవాలి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 తన చేతికి డబ్బులు రాగానే  మొదటసారిగా ఉప్పును కొనడం వల్ల వృధా ఖర్చులు కాకుండా డబ్బులు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉప్పు నెగటివ్ ఎనర్జీ తొలగించి పాజిటివ్ ఎనర్జీ కలిగిస్తుంది.
ఇంట్లో ఆడవారు జుట్టు విరబోసుకుని ఉండకూడదు. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో దారిద్రం తాండవిస్తుంది. ఇంకా శుభములు జరగకుండా ఆటంకాలు కలుగుతాయి.
 ఇంట్లో ఉన్నప్పుడు కూర్చునే విధానం కూడా బాగుండాలి. కాలు మీద కాలు వేసుకుని, కాళ్లు అల్లాడిస్తూ కూర్చోడం,ఒంటి కాలి మీద నిలిచి ఉండడం ఇలాంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల కష్టాలు, నష్టం జరిగే అవకాశం ఉంటుంది.
 ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు కుడి చేత్తో మాత్రమే ఇవ్వాలి. ఎడమ చేతితో ఇవ్వకూడదు.
 పూలు అమ్మడానికి వచ్చినప్పుడు వద్దు అనకుండా రేపు తీసుకుంటామని చెప్పాలి. నెలసరి సమయంలో ఆడవాళ్ళు పూలు పెట్టుకోకపోవడం మంచిది.
 మనము మాట్లాడేటప్పుడు చెడ్డమాటలు, అసభ్యకర మాటలు మాట్లాడకూడదు.మండిపోతోంది, కాలిపోతోంది, పీడ,శని,దరిద్రం,కష్టం అనే పదాలనుఎప్పుడూ వాడకూడదు.
 ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో దూళి, దుమ్ము బూచి,వంటి వాటిని ఇంట్లో లేకుండా అందంగా ఉంచుకోవాలి. ఇలాంటివి ఉండటంవల్ల దరిద్రం వెంటాడుతుంది.10 రోజులకు ఒకసారైనా వెంటని శుభ్రం చేసుకోవాలి. మంగళ, శుక్రవారాల్లో ఇలాంటి పనులు చేయకూడదు.
 ఉదయం లేవగానే మొదట బ్రష్ చేసుకుని,తర్వాత ఇల్లు క్లీన్ చేసుకుని,  తర్వాత స్నానం చేయాలి.అప్పుడు స్టవ్ వెలిగించి వంట చేయాలి. వంట చేసేటప్పుడు భక్తి పాటలు గానీ, ఏదైనా సంగీతం గాని వింటూ చేయడం వల్ల వంటలు అమృతంగా ఉంటాయి.పాజిటివ్ గా ఆలోచిస్తూ,  మనస్సునుప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.                                                                                                                                                                

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: