జీవిత సత్యాలు: ఆ ఒక్కరు చెప్పే మాట వినకపోతే.. మీరు జీవితంలో బాగుపడరు..?

జీవితం సాఫీగా సాగిపోవాలంటే.. ఏం చేయాలి.. ఎవరు చెప్పింది  ఫాలో కావాలి.. చిన్ననాటి నుంచి మన చేయి పట్టుకుని నడిపించిన తల్లిదండ్రులు చెప్పింది వినాలా.. మనలో జ్ఞాన జ్యోతి వెలిగించిన గురువులు చెప్పిన విధానం అనుసరించాలా.. జీవితంలో మనమేంటో తెలిసిన మన మనసు తెలిసిన మిత్రులు చెప్పే మాటలు ఆచరించారా.. జీవితంలో ఎవరి మాట వినాలి..? 


ఈ సందేహం మనలో చాలా మందికి వస్తుంది. కొన్నిసార్లు పైన చెప్పిన వారంతా దాదాపు ఒకేలా మనకు సలహాలు ఇవ్వొచ్చు. అలాంటప్పుడు ఇబ్బంది ఉండదు. కానీ.. వారు చెప్పేది భిన్నంగా ఉంటే.. ఒకరి సలహాకు మరొకరి సలహాకు పొంతన లేకుంటే ఏం చేయాలి.. ఎవరు చెప్పేమాటలు వినాలి.. ఇలాంటి సమయంలో ఎటువైపు మొగ్గాలి.. ఇది నిజంగా ధర్మసందేహమే. 

 


అయితే.. ఇలాంటి సమయంలో.. పైన చెప్పివారందరితో పాటు మనం తప్పకుండా వినాల్సిన మాట ఇంకొకరిది ఉంది. ఆ స్వరం చాలా ప్రత్యేకమైంది. ఎవరి మాట విన్నా.. వినకపోయినా ఆ స్వరం మాత్రం తప్పక వినితీరాస్సిందే. ఆ స్వరం ఏంటో తెలుసా.. మీ అంతరాత్మ వినిపించే మాట. ఎందుకంటే.. మీ గురించి కచ్చితంగా తెలిసింది మీ అంతరాత్మకే. 
  

ఏది తప్పో , ఏది ఒప్పో  మీ అంతరాత్మ సదా చెబుతూనే ఉంటుంది. అబ్బే అది నాకు తెలియదు అంటూ చెప్పడం ఆత్మవంచనే అవుతుంది. అందుకే మీ అంతరాత్మ మాట తప్పకుండా వినండి. మీ హితులు చెప్పిందీ... మీ అంతరాత్మ చెబుతున్నదీ ఒకటే అయితే ఇబ్బంది లేదు. కానీ మీ అంతరాత్మ మీ హితుల మాటలతో విభేదిస్తే మీరు ఓటేయాల్సింది మీ అంతరాత్మకే. అది మిమ్మల్ని ఎప్పటికీ తప్పుదోవ పట్టించదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: