ఈ రోజు ఎలాంటి ప్రయాణాలు చేయకండి.... మీ మంచికే చెప్పేది

మాంసం తినని వారికి, దాంతో సమానమైన పోషకాలని ఇచ్చేవి మినుములు. అందుకనే గారెలు, మాంసంతో... ఈ రోజు పెద్దలకి ప్రసాదం పెడతారు. అందుకే ‘కనుమ రోజు మినుములు తినాలి' అనే సామెత మొదలైంది.

పూర్వకాలంలో చాలామంది ప్రయాణాలకు ఎడ్ల బండినే వాడతారు. కనుమ రోజున వాటికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు కాబట్టి ఈ ఒక్కరోజైనా ఎద్దులను కష్టపెట్టకూడదనే భావనతో ప్రయాణాలను విరమించుకుంటారని చెప్పుకొస్తారు. మరోవైపు సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. ఇక ఇది దేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైనసమయమని మన పూర్వీకులు అంటుంటారు.

కనుమ రోజు హడావుడి ఉంటుంది కాబట్టి, ఆ రోజు పెద్దలను తల్చుకుని, బంధువులతో కాస్త సమయం గడిపి, విశ్రాంతి తీసుకుని మర్నాడు ప్రయాణించమని చెబుతారు. అందుకే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు' అన్న సామెత పుట్టి ఉండవచ్చు.

ఈ రోజు ప్రయాణాలు చేయుట ఆశుభంగా భావిస్తారు. మొదటి మూడు రోజుల్లోనూ పొంగలితో పాటు, సకినాలు, చేకోడిలు, కారంపూస, అరిసెలు, అప్పాలు, నువ్వులముద్దలు మొదలైన పిండి వంటలు చేసి తిని ఆనందిస్తారు. సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో చిన్నపెద్ద అనే తారతమ్యం భేదం లేకుండా గాలిపటాల ను ఎగురవేసి ఆనందిస్తారు.

సంక్రాంతిలో మూడోరోజైన కనుమరోజు గ్రామ పొలిమేర దాటకూడదన్న నియమం ఉంది. కాబట్టి ఇంటికి వచ్చిన ఆడపడుచులని సత్కరించుకుని, మనసారా బహుమతులు ఇచ్చుకుని ముక్కనుమరోజు వారికి వీడ్కోలు పలుకుతారు. కొంత మంది ముక్కనుమను కూడా పండుగగా భావించి, ముక్కనుమనాడు కూడా బయల్దేరకూడదని చెబుతుంటారు. కానీ ఈ విషయమై శాస్త్రపరంగా ఎలాంటి నియమమూ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: