ఎసిడిటీ మందులతో క్యాన్సర్ ముప్పు

Seetha Sailaja
ఈ మధ్య కాలంలో ఎసిడిటీ లేనివారు చాల తక్కువగా కనిపిస్తున్నారు. దీనితో ఈ ఎసిడిటీ నివారణ కోసం అనేక రకాల మందులు వాడటం సర్వసాధారణ విషయంగా మారింది. అయితే ఇలాంటి అలవాటు ఒక ప్రమాదకరమైన వ్యాధి మనకు వచ్చేలా చేస్తోంది అంటూ అనేక లేటెస్ట్ పరిశోధనలు తెలియచేస్తున్నాయి.

ఎక్కువ కాలంపాటు ఈ ఎసిడిటీ మందులకు మన శరీరం అలవాటుపడితే ఈ మందుల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు రెట్టింపు అవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హెలికో బ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కారణంగా ఎసిడిటీ ఏర్పడుతుందని అయితే దీని నివారణ కోసం దీర్ఘకాలంగా మందులు వాడితే అవి వికటించి కడుపులో క్యాన్సర్ కణాలు ఏర్పడటానికి కారణం అవుతాయని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. 

ఈమధ్య కాలంలో మూడేళ్ళపాటు ఎసిడిటీ మందులను ఎక్కువగా తీసుకుంటున్న 63 వేలమంది పై చేసిన లేటెస్ట్ పరిశోధనలలో దాదాపు సగం మందికి క్యాన్సర్ లక్షణాలు కనిపించడం ఆ అధ్యయనాన్ని నిర్వహించిన వైద్యులకు ఆశ్చర్యాన్ని కలిగించినట్లు తెలుస్తోంది. దీనినిబట్టి చూస్తూ ఉంటే మందులకన్నా ఎసిడిటీ నివారణకు ఆహారపు అలవాట్లతోపాటు కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను కూడ పాటిస్తే ఆరోగ్యానికి మంచిది అని అనిపించడం సహజం. 

ముఖ్యంగా ప్రతి రోజూ ఒక గ్లాసు గోరువెచ్చని వేడినీరు తాగడం కాని, రోజువారీ ఆహారంలో, అరటిపండు, వాటర్ మెలన్, దోసకాయ వంటివి తినడంతో పాటు పుచ్చకాయ రసం తాగితే మరీ మంచిది.  సమస్య అధికంగా వుంటే కొబ్బరి నీరు త్వరగా పనిచేస్తాయి. ఇలాంటి అనేకరకాల సహజసిద్ధమైన చిట్కాలను అనుసరించకుండా కేవలం రకరకాల ఎసిడిటీ మందులను వేసుకుంటే క్యాన్సర్ ముప్పు తప్పదు అని అంటున్నారు శాస్త్రవేత్తలు..   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: