మనం చేసే ఎలాంటి పూజలు మరి ఎలాంటి శుభకార్యాలలో అయినా తాంబూలo ప్రస్తావన లేకుండా ఆ శుభకార్యాలు జరగవు. విందు భోజనం తరువాత మనం వేసుకునే తాంబూలం వల్ల మనకు చేకూరే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తమలపాకుల వల్ల మనిషి ఆరోగ్యానికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా అని అనిపించడం సహజం.
మన గాయకులు చాలామంది తమ కంఠం జీర లేకుండా చక్కగా పలకడానికి ఎక్కువగా తాంబూలం వేసుకుంటారు అన్నది వాస్తవం. తమలపాకులు నవలడం వల్ల పళ్ళు, చిగుళ్ళ, దంతాలు పటిష్టంగా మారతాయి. తాంబూలం వేసుకోవడం వల్ల మన నాలిక పై లాలాజలం వృద్ధి చెందుతుంది దానివల్ల జీర్ణ శక్తి పెరిగి జీర్ణ క్రియ బాగుంటుంది.
చాలామంది తరుచూ బాధపడే తల నొప్పి, కీళ్ళనొప్పుల సమస్యల నుండి ఈ తమలపాకులు కాపాడుతాయి. తమలపాకు వక్క కలిపి తింటే దగ్గు ఆస్తమాలు తగ్గుతాయి. అంతేకాదు తమలపాకులు మన శరీరంలోని వాత గుణాన్ని అరికడతాయి. ఈ ఆకులలో వేసుకునే సున్నం వల్ల మన శరీరానికి క్యాలిష్యం సమృద్ధిగా లభిస్తుంది.
పూర్వ కాలపు రోజులలో స్త్రీలు లిప్ స్టిక్ లాంటివి లేని రోజులలో స్త్రీలు తమ పెదవులు అందంగా ఎర్రగా కనిపించడానికి ఇలా తాంబూలాన్ని వేసుకునే వారు అనే వార్తలు ఉన్నాయి. ఈతాంబూలo వల్ల మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవడమే కాకుండా మన శరీరంలో రక్త వృద్ధికి ఈ ఆకులు తోడ్పడతాయని ఆయుర్వేదవైద్యులు చెపుతూ ఉంటారు. ఇలా శుభకార్యాలలోనే కాకుండా ఆరోగ్యానికి కూడ ఎంతో మేలుచేసే ఈ తమలపాకులను తాంబూలంగా వేసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు తెలిస్తే తాంబూలo అలవాటు లేని వారు కూడ అలవాటు చేసుకుంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు..