బుడుగు: చిన్న పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారా..?

N.ANJI
నేటి సమాజంలో అధిక మంది పిల్లలు బాధపడుతున్న సమస్యలలో ఊబకాయం ఒకటి. అధిక బరువును నిర్లక్ష్యం చేస్తే.. అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చిన్న పిల్లల అధిక బరువు సమస్య తల్లిదండ్రులకు ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలనే ఆలోచనలో పడుతున్నారు. అయితే ప్రపంచంల అత్యధికంగా ఊబకాయంతో బాధపడుతున్న పిల్లలు కలిగిన దేశల్లో భారత్ రెండో స్థానంలో ఉందని గతేడాది ఓ అధ్యాయనంలో తేలింది. దాదాపు కోటి 40 లక్షల మంది చిన్నారు ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారని వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో చైనా ఉంది. అమెరికా బ్రిటన్ దేశాల్లో కూడా ఊబకాయులు అధికంగానే ఉన్నారు. అయితే పరిశోధకులు పిల్లల్లో అధిక బరువును గుర్తించేందుకు సులువైన మార్గాన్ని కనుగొన్నారు. పిల్లల బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంబీ)ని పరిశీలించినట్లయితే పిల్లల బరువు, ఎత్తు తెలియజేస్తుందని, ఎనిమిదేళ్ల వయసు నుంచే అధిక బరువు సమస్య ప్రారంభమవుతుందని తెలియజేశారు.
సాధారణ వ్యక్తులతో పోల్చితే ఊబకాయంతో బాధపడే గర్భిణికి పుట్టే అమ్మాయికి అధిక బరువు సమస్య 10 రెట్లు అధికంగా ఉంటుందన్నారు. ఒకవేళ తండ్రి అధిక బరువుంటే అతడికి పుట్టే మగపిల్లలకు 6 రెట్లు ఊబకాయ సమస్య వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఊబకాయంతో బాధపడే తల్లిదండ్రులు, పిల్లలు తప్పకుండా ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. స్వీట్లు, కూల్‌డింక్స్ ఏదైనా చక్కెరతో తయారు చేసిన మిశ్రమాన్ని సేవించకూడదు. సమతుల పోషకాహారాన్ని తీసుకోవాలి. భోజనాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని, కుటుంబసభ్యులంతా ఒకే చోట కలిసి తినేందుకు ప్రయత్నించాలి.
ఆహారంతోపాటు శరీరానికి వ్యాయామం కూడా అంతే అవసరం రోజూ తల్లిదండ్రులు తమ పిల్లలను పార్కులకు తీసుకెళ్లి గంటపాటు వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలా అని విరామం లేకుండా వ్యాయామం చేయకూడదని, 5-10 నిమిషాలు బ్రేక్ తీసుకుని ఎక్సర్‌సైజ్ చేస్తుండాలన్నారు. కంటి నిండా నిద్రపోవాలని తెలిపారు. రాత్రి పూట తొందరగా పడుకునేలా చూసుకోవాలని తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: