చార్మినార్ టు గోల్కొండ.. బైక్ పై వెళ్లొచ్చు, బస్సులో వెళ్లొచ్చు.. కాస్త డబ్బు లెక్కువుంటే ఆటోలో వెళ్లొచ్చు. ఇది కామన్ రూట్ కానీ, ఎన్నో ఏళ్లుగా కథలుగా చెప్పుకుంటున్న రూట్ బయటపడితే అలాంటి మార్గం నిజంగానే ఉంటే చార్మినార్ టు గోల్కొండ రోడ్డు మీద నుంచి కాకుండా రోడ్డు కింద నుంచి వెళ్తే నిజంగానే అప్పుడది కథ అవుతుంది. కానీ చార్మినార్ దగ్గర బయటపడ్డ ఆ మెట్లు పాత ప్రచారాలకు కొత్త ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయి. ఇంతకీ ఆ మెట్లు ఎక్కడివి? అవి ఎక్కడికి తీసుకెళ్తాయి? హైదరాబాద్ సెక్టర్ లో పాత బస్తీ నడివొడ్డున చెక్కుచెదరని 430 ఏళ్ళ చరిత్రే ఈ చార్మినార్. చార్మినార్ అంటే చూడాలనిపించే కట్టడం. చార్మినార్ కట్టినప్పటినుంచి ప్రచారంలో ఉన్న ప్రతి ఒక్కరూ చూడాలనుకుని చూడలేకపోయింది మరొకటి ఉంది. అదే చార్మినార్ టు గోల్కొండ సొరంగ మార్గం. ఇప్పుడు మరొక సారి గోల్కొండ చుట్టూ తిరిగి సిటీ అంతా వ్యాపించి తెలుగు స్టేట్స్ మొత్తం హాట్ టాపిక్ గా మారింది.
వందల ఏళ్ళ క్రితం మొదలైన ప్రశ్నలే ఇప్పుడు మళ్ళీ కొత్తగా వినిపిస్తున్నాయి. చార్మినార్ ముందు లేటెస్ట్ గా బయటపడిన ఓల్డెస్ట్ మెట్లు ఈ ప్రశ్నలకు సమాధానాన్ని చెబుతున్నాయి. నాలుగు వందల ఏళ్ళ కింద నిర్మించిన చార్మినార్ కింద అప్పుడు నిజంగానే సొరంగమార్గం ఉండేదా? ఒకవేళ ఉంటే చార్మినార్ నుంచి ఎక్కడి వరకు ఉంది? ఇప్పుడివే ప్రశ్నలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తోపాటు హైదరాబాద్ వాసులందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. అసలు ఈ మెట్లు ఎలా బయట పడ్డాయి..? చార్మినార్ నుంచి గోల్కొండ వరకు సొరంగ మార్గం ఉందని జరుగుతున్న ప్రచారానికి టన్నుల్లో బూస్ట్ ఇచ్చేలా ఈ మెట్లు బయటపడ్డాయి. ఇన్నాళ్లు లేనిది ఈ మెట్లు ఇప్పుడే ఎందుకు బయటకచ్చాయంటే దాని వెనుక ఒక చిన్న కథ ఉంది.
చార్మినార్ నిర్మాణాన్ని బాగా చేయించే పనిలో చార్మినార్ ఆవరణలో తవ్వించిన ఓ గుంతలో ఈ మెట్లు బయటపడ్డాయి. ఇప్పుడు చార్మినార్ దగ్గర బయటపడిన మెట్ల పైన పెద్ద చర్చే నడుస్తోంది. చార్మినార్ దగ్గర పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలపై ఎంఐఎం నేతలు ప్రశ్నించడంతో అధికారులు గుంతలను పూడ్చేశారు. కానీ తవ్వకాలు జరిపితే భారీ సొరంగం బయటపడే అవకాశం ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అయితే పురావస్తు శాఖ అధికారులు ఎలా ముందుకు వెళ్తారు అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.