ఈ రాళ్లతో రుతుపవనాల రాకను తెలుసుకోవచ్చా..!

MOHAN BABU
నారాయణపేట జిల్లా కృష్ణ మండలం లోని ముడుమాల్ గ్రామ సమీపంలోని ఓ మారుమూల ప్రాంతమది.అక్కడ ఒకచోట14 నుంచి 16 అడుగుల ఎత్తున 80 వరకు నిలువురాళ్లు కనిపిస్తాయి. చుట్టూ పెద్ద పెద్ద గుండు రాళ్లు సర్కిల్ గా రూపొందించి ఉంటాయి. చూసిన వారంతా ఉత్త రాల్లే కదా అని తమ దారిన తాము పోతుంటారు.కానీ అదొక అబ్బురపరిచే ప్రాంతమని ఎవరికి తెలియదు. ఆసియా ఖండంలోని ఇలాంటి చోటు మరెక్కడా లేదని కనీసం ఊహించి కూడా ఉండరు. క్రీస్తు పూర్వం 1000 ఏళ్ల కిందటే ఈ ప్రదేశంలో ఆదిమానవులు ఆస్ట్రో నాటికల్ అబ్జర్వేటరీ సెంటర్ రన్ చేశారని సైంటిస్టులు చెబుతున్నారు.

వీటినే మెగాలిథిక్ బరియల్స్ (నిలువురాళ్లు సమాధులు)అని కూడా పిలుస్తారు. ఈ రాళ్లతో రుతుపవనాల రాక, పంటల సాగు, టైం తెలుసుకోవడం, ఏ కాలంలో ఏం పంట వేయాలి అనే వివరాలు కనుక్కునేవారట. కానీ అలాంటి అద్భుతమైన ఈ నిలువు రాళ్ల చరిత్ర నిట్టనిలువుగా కూలిపోతుంది ప్రభుత్వం,ఆఫీసర్లు పట్టించుకోక కాలగర్భంలో కలిసిపోతుంది. కృష్ణా నది తీరంలో తెలంగాణ- కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో నారాయణపేట జిల్లా, కృష్ణ మండలం లోని ముదుమాల్ గ్రామ సమీపంలో లోహ యుగానికి చెందిన సమాధులు ఉన్నాయి. ఈ నిలువు రాళ్లను చనిపోయిన వారి శవాలు పైకి లేవకుండా సమాధులపై ఉంచారని స్థానికులు చెబుతారు. అలాగే 80 ఎకరాల విస్తీర్ణంలో 300కుపైగా చిన్న రాళ్ళు ఉన్నాయి. కొన్నేళ్ల కింద ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ కు చెందిన ప్రొఫెసర్ కేపి రావు ఈ ప్రాంతంలో పర్యటించి రిసెర్చ్ చేశారు. ఈ సందర్భంగా చాలా సీక్రెట్స్ బయటపడ్డాయి. సర్కిల్ ఆకారంలో రాళ్లను పేర్చి సప్తర్షి మండలాన్ని క్రియేట్ చేసి, సూర్యుడి కిరణాల ఆధారంగా టైం కొలిచే వారన్నారు. పాలమూరు యూనివర్సిటీ కి చెందిన స్టూడెంట్స్ కూడా ఇక్కడ పరిశోధన చేశారు.

 తెలంగాణలో అద్భుత చరిత్రకు నిలయమైన ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దేందుకు యునెస్కో గుర్తింపు తీసుకు వచ్చేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ప్రెసిడెంట్, ట్రస్ట్ చైర్మన్ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. ఎంతో చరిత్ర కలిగిన నిడువు రాళ్లపై  రాష్ట్ర ప్రభుత్వం, పురావస్తు శాఖ నిర్లక్ష్యం వహించాయి.మూడేళ్లుగా ఈ ప్రాంతం అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో ఈ ఏరియా మొత్తం ముళ్ళ పొదల తో నిండిపోయింది. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే అద్భుతమైన రాతి సంపద,వేల ఏళ్ల క్రితం ఆదిమానవులు ఏర్పాటు చేసుకున్న ఖగోళశాస్త్ర వింతైన ఈ ప్రాంతంపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని, పర్యటకులకు కనీసం కూర్చునేందుకు,తాగేందుకు నీరు కూడా లభించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: