ఒక్క ఛాయాచిత్రం సజీవ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఒక ఫోటో న్యాయస్థానంలో తిరుగులేని సాక్ష్యం అవుతుంది. ఒక్క ఫోటో అంత భావాలను వ్యక్తపరుస్తుంది. ప్రకృతి రమణీయతను అందిస్తుంది. కోట్ల హృదయాలను బావోద్వేగ పరుస్తుంది. ఒక ఫోటో అంటే సాధారణ చిత్రమే కాదు, సామాజిక మాధ్యమం లో ప్రవహించే వార్తాపత్రిక. ఫోటోగ్రఫీ అంటే ఫోటో తీయడం మాత్రమే అనుకుంటే పొరపాటే. ఒక్క ఫొటోతో ఉద్యమం పుట్టవచ్చు. అన్యాయాన్ని అరికట్టవచ్చు. ఆశ్చర్యాన్ని వ్యక్త పరచవచ్చు. అనుభూతిని మిగిల్చవచ్చు. నిజాన్ని నిర్భయంగా తెలుసుకోవచ్చు. రహస్యాన్ని బహిర్గతం చేయవచ్చు. కోట్ల గుండెల్లో స్థానాన్ని సంపాదించవచ్చు. శుభ క్షణాలను ఆల్బంలో బంధించవచ్చు.
ఒక ఫోటోగ్రాఫర్ కెమెరా ఉంటే సరిపోదు, ఫోటోలు బంధించ గల కోణాలు, క్షణాలు ఫోటో పరిధిలో లాంటి పలు ప్రత్యేక నైపుణ్యాలు ఉండాలి. ఒక సాధారణ దృశ్యాన్ని అసాధారణ అద్భుత చిత్రంగా మార్చగలగడం ఒక నేర్పు అని చెప్పవచ్చు. కెమెరాతో అనుబంధాన్ని పెనవేసుకున్న పోతున్నా ఫోటోగ్రాఫర్లు, తమ జీవిత లక్ష్యంగా జీవనభృతి సాధనంగా తీసుకుని ఎందరో మహానుభావులు మన మధ్య కథ లాడుతున్నారు. ఫోటోగ్రఫీ వృత్తిపట్ల చిన్నచూపు చూసే వారికి ఛాయాచిత్రాలు గురించి అవగాహన ఎంతో అవసరం. ఒక అరుదైన ఛాయాచిత్రం కోట్ల రూపాయల విలువ కలుగవచ్చు. అపూర్వ అంతర్జాతీయ గుర్తింపును కూడా ఇవ్వవచ్చు. ఫోటోగ్రఫీలో కళానైపుణ్యం వైజ్ఞానిక శాస్త్రం కలిగి ఉంటాయి. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో సెల్ఫోన్ అందరి చేతుల్లో నాట్యమాడుతుంది. ప్రతి ఫోన్ లో అత్యాధునిక కెమెరా కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరు తమ కిష్టమైన దృశ్యాలను కెమెరాలో బంధించి, సామాజిక మాధ్యమాల్లో అందుబాటులోకి తేవడం లైక్ లను చూసి సంబర పడి పోవడం సర్వ సాధారణమైంది. 1826 లో తొలి శాశ్వత ఛాయాచిత్రాన్ని ఫ్రెంచ్ జోసెఫ్ నైపూర్ అనే మహానుభావుడు తీయడం జరిగింది. 1837 లో నైపాస్ లూయిస్ డెంగ్యు రే కలిసి రూపొందించిన డెంగ్యూ రైట్ అప్ కెమెరా నేటి ఆధునిక కెమెరాకు ఆధారంగా నిలిచింది.
1880లో తొలిసారి కోడక్ కంపెనీ కెమెరాలను వాణిజ్యపరంగా మార్కెట్లోకి తీసుకువచ్చింది. 1940లో కెమెరా ఫిల్ముల ద్వారా సామాన్యులకు అనుకూలమైంది. 1839 ఆగస్టు 19న నై పాస్ డెంగ్యూ రే రూపొందించిన కెమెరా పేటెంట్ హక్కులను పెంచు ప్రభుత్వం కొనడం జరిగిన సందర్భానికి గుర్తుగా ప్రతియేటా 19 ఆగస్టు న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం గా జరుపుకుంటారు. ఫోటోలు నిషితంగా పరిశీలించడం, ఫోటోగ్రాఫర్ మనోగతాన్ని అర్థం చేసుకోవడం ఛాయాచిత్ర రహస్యాన్ని ఆకళింపు చేసుకోవడం సామాన్య ప్రజల బాధ్యతగా గౌరవించాలి.