ఆగష్టు 14:చరిత్రలో ఈ రోజు..

Purushottham Vinay
ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్యమైన సంఘటనల విషయానికి వస్తే.. 

1862 వ సంవత్సరంలో బోంబే హైకోర్టు ప్రారంభమయ్యింది.

1947 వ సంవత్సరంలో భారత దేశ విభజన జరిగి పాకిస్తాన్ దేశం ఏర్పడింది.

2008 వ సంవత్సరంలో ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికను కేంద్ర ప్రభుత్వం చిన్న చిన్న మార్పులతో ఆమోదించడం జరిగింది.

ఇక చరిత్రలో ఈ రోజు జరిగిన జాననాల విషయానికి వస్తే...

1895 వ సంవత్సరంలో మాగంటి బాపినీడు జన్మించారు. ఈయన స్వాతంత్ర్య సమరయోధుడు ఇంకా తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని ప్రచురించాడు.

1923 వ సంవత్సరంలో కులదీప్‌ నయ్యర్‌ జన్మించారు. ఈయన భారతీయ జర్నలిస్టు ఇంకా కాలమిస్టు అలాగే మానవ హక్కుల ఉద్యమకారుడు ఇంకా రచయిత కూడా.

1927 వ సంవత్సరంలో మానాప్రగడ శేషసాయి జన్మించారు. ఈయన ఆకాశవాణి ఇంకా దూరదర్శన్ వ్యాఖ్యాత.

1933 వ సంవత్సరంలో అక్కినేని అన్నపూర్ణ జన్మించారు. ఈమె తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు భార్య.

1930 వ సంవత్సరంలో జాన నాగేశ్వరరావు జన్మించారు. ఈయన జనవాక్యం అనే పత్రికను నడిపారు.

1946 వ సంవత్సరంలో పి.వి. రాజేశ్వర్ రావు జన్మించారు.ఈయనో రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి.

1966 వ సంవత్సరంలో హాలీ బెర్రీ జన్మించారు. ఈమె అమెరికన్ నటి.

1968 వ సంవత్సరంలో ప్రవీణ్ ఆమ్రే జన్మించారు. ఈయన భారతదేశ క్రికెట్ క్రీడాకారుడు.

ఇక చరిత్రలో జరిగిన మరణాల విషయానికి వస్తే..

1910 వ సంవత్సరంలో గాదె చిన్నప్పరెడ్డి మరణించారు. ఈయన స్వాతంత్ర్య సమరయోధుడు.

1958 వ సంవత్సరంలో ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ మరణించారు.ఈయన భౌతిక శాస్త్రవేత్త ఇంకా నోబెల్ బహుమతి గ్రహీత.

1994 వ సంవత్సరంలో రాజశ్రీ మరణించారు. ఈయన సినిమా పాటల రచయిత.

2010 వ సంవత్సరంలో ఈడుపుగంటి వెంకట సుబ్బారావు మరణించడం జరిగింది. ఈయన వ్యవసాయ శాస్త్రవేత్త.

ఇక ఇవి చరిత్రలో జరిగిన ముఖ్య సంఘటనలు...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: