బ్రిటిష్ వారి తుపాకీ గుళ్లకు బెదరకుండా వారి గుండెలదిలేలా సాగిన క్విట్ ఇండియా మహోద్యమం భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసింది. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ప్రజలు, స్వాతంత్ర్య కాంక్షతో స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధీ రూపకల్పనలో సాగిన ఈ క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసింది. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ప్రజలు స్వతంత్ర కాంక్షతో స్వచ్ఛందంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. మహాత్మ గాంధీ రూపకల్పనలో సాగిన క్విట్ ఇండియా ఉద్యమం తెల్లదొరల అహాన్ని అణచి వేసింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన ఈ ఉద్యమం తెల్లదొరలను భయబ్రాంతులకు గురి చేసింది.
ఆగస్టు ఉద్యమంగా వర్ణించబడే క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తిని గుర్తు చేసుకొని దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన మహనీయుల త్యాగాలను స్మరణకు తెచ్చుకునే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 8వ తేదీని క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవంగా జరుపుకుంటారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో మహాత్మ గాంధీతో సహా పలువురు ప్రముఖులను లక్షలాది మంది ప్రజలను ఎలాంటి విచారణ లేకుండా చాలా రోజులు నిర్బంధంలో ఉంచారు. స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రధాన భూమిక వహిస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ ను చట్టవిరుద్ధమైన సంస్థగా బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రముఖులందరిని జైలులో నిర్బంధించిన కులమతాలకు అతీతంగా ప్రజలు ఉవ్వెత్తున ఎగిసిన స్వతంత్ర కాంక్ష బ్రిటిష్ వారికి ముచ్చెమటలు పట్టించింది. డు ఆర్ డై నినాదం ప్రాచుర్యం పొందింది.
కొన్ని సంస్థలు, పార్టీలు పెట్టిన ఉద్యమాన్ని వ్యతిరేకించాయి. ఈ ఒక్క ఉద్యమాన్ని బ్రిటిష్ వారు సామదాన దండోపాయాలతో అణచి వేశారు. అయితే అజాన్ హిందూ పాజ్ ద్వారా సుభాష్ చంద్రబోస్ తెల్ల దొరలపై సమర శంఖం పూరించారు అని చెప్పవచ్చు. కంటికి కన్ను పంటికి పన్ను అనే రీతిలో బ్రిటిష్ పాలకులకు ముచ్చెమటలు పట్టించారు. జర్మనీ బ్రిటీషుల మధ్య సాగిన యుద్ధం వల్ల బ్రిటిష్ కు చికాకులు తలెత్తాయి. ఆర్థికంగా దెబ్బతిన్నది. ఇదే సమయంలో వారి పట్ల భారత దేశంలో పెరుగుతున్న అసంతృప్తితో అణిచివేయడం సాధ్యం కాలేదు. దీంతో దేశాన్ని విడిచి వెళ్లిపోయారు.