మే 27వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

Suma Kallamadi
క్యాలెండర్ లో ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు మే 27 కాగా.. ఈ తేదీకి చరిత్రలో ఎంత ప్రాధాన్యత ఉందో.. ఈరోజు జరిగిన విశేషాలు ఏంటో.. ఇదే రోజున ఏ ఏ ప్రముఖులు జన్మించారో.. ఏ ఏ ప్రముఖులు మరణించారో.. ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.


ప్రముఖుల జననాలు:


1332: ఇబ్నె ఖుల్దూన్, చరిత్రకారుడు, పండితుడు, ధార్మిక శాస్త్రవేత్త,, రాజకీయ వేత్త. (మ.1406)


1895: దీపాల పిచ్చయ్య శాస్త్రి, కవి, పండితులు, విమర్శకులు, శబ్దశిల్పి. (మ.1983)


1931: ఒ.ఎన్.వి.కురుప్ మలయాళం కవి, సినీ గేయకర్త (మ.2016).

1957: నితిన్ గడ్కరీ, భారత న్యాయవాది, రాజకీయవేత్త, భారత రవాణా మంత్రి.


1960: దీర్ఘాశి విజయభాస్కర్, నాటక రచయిత, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత.


1962: రవిశాస్త్రి, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.


1975: మైఖేల్ హస్సీ, ఆస్ట్రేలియా క్రికెటర్


1977: మహేలా జయవర్ధనే, శ్రీలంక క్రికెటర్


1982: అంకిత, రస్నా బేబీగా పేరొందిన తెలుగు సినిమా కథానాయిక.


1982: నటాల్య, కెనడియన్ ప్రొఫెషనల్ రెజ్లర్


ప్రముఖుల మరణాలు:


1896 - అలెగ్జాండర్ స్టోలెటోవ్, రష్యన్ భౌతిక శాస్త్రవేత్త, ఇంజనీర్, విద్యావేత్త (జ.1839)


1910: రాబర్ట్ కాక్, జర్మన్ వైద్యుడు, జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (జ.1843).


1918: ఉట్సు మన్మోన్, జపనీస్ సుమో రెజ్లర్, 18వ యోకోజునా (జ .1869)


1919: కందుకూరి వీరేశలింగం పంతులు, భారతదేశ సంఘసంస్కర్త. (జ.1848)


1943: గోర్డాన్ కోట్స్, న్యూజిలాండ్ సైనికుడు, రాజకీయవేత్త, న్యూజిలాండ్ 21వ ప్రధాన మంత్రి (జ .1878)


1962: పళని సుబ్రహ్మణ్య పిళ్ళై, మృదంగ విద్వాంసుడు (జ.1908).


1964: జవహర్‌లాల్ నెహ్రూ, భారతదేశ మొదటి ప్రధానమంత్రి. (జ.1889)


1980: సాలూరు హనుమంతరావు, తెలుగు, కన్నడ సినిమా సంగీత దర్శకులు. (జ.1917)

1986: అజోయ్ ముఖర్జీ, భారత రాజకీయవేత్త, మాజీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (జ .1901)


1999: సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, క్లాసికల్, ఫోక్ డాన్సర్. (జ.1927)


2015: పవని నిర్మల ప్రభావతి, రచయిత్రి (జ.1933).


2017: గ్రెగ్ ఆల్మాన్, అమెరికన్ సంగీతకారుడు, గాయకుడు, పాటల రచయిత (జ .1947)


ముఖ్య సంఘటనలు:


1703: పీటర్ చక్రవరి పీటర్స్ బర్గ్ నిర్మాణానికి శంకుస్థాపన.


1921: ఆఫ్ఘనిస్తాన్ 84 సంవత్సరాల తరువాత బ్రిటిష్ నియంత్రణ నుండి స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది.


1931: స్విస్ భౌతిక శాస్త్రవేత్త అగస్టే పిక్కార్డ్, అతని సహోద్యోగి చార్లెస్ నిప్ఫర్ కలిసి బెలూన్‌లో కూర్చొని స్ట్రాటో ఆవరణంలోకి మొట్టమొదటిగా ప్రయాణించారు. ఈ బెలూన్‌ 17 గంటల సమయంలో 51,793 అడుగుల ఎత్తుకు చేరుకుంది. ఇది విమానయాన చారిత్రక సందర్భాలలో ఒకటిగా నిలిచింది.


1934: రెండవ ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇటలీలో ప్రారంభమయ్యాయి.


1948: ఎర్రకోటలోని ప్రత్యేక న్యాయస్థానంలో మహాత్మా గాంధీ హత్య విచారణ ప్రారంభమైంది.  తొమ్మిది మంది వ్యక్తులు గాంధీని చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. కాగా, 1949 ఫిబ్రవరి 10న విచారణ ముగిసింది.


1964: భారత తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జారీలాల్ నందా నియమితుడైనాడు.


1995: నాలుగు హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో సూపర్ మ్యాన్ పాత్రలు పోషించి ప్రసిద్ది గాంచిన నటుడు క్రిస్టోఫర్ రీవ్ గుర్రంపై స్వారీ చేస్తూ కిందపడ్డారు. ఈ ఘటనలో ఆయన వెన్నెముక కి తీవ్రమైన గాయం అయింది. ఆ గాయం మరింత తీవ్రంగా ఉండటంతో తన మెడ నుంచి ఇతర భాగాలు ఏమీ పని చేయడం లేదని క్రిస్టోఫర్ అనుకున్నారు.


2016 - హిరోషిమా పీస్ మెమోరియల్ పార్కును సందర్శించి హిబాకుషాను కలిసిన యునైటెడ్ స్టేట్స్ యొక్క మొదటి అధ్యక్షుడు బరాక్ ఒబామా.


పండుగలు, జాతీయ దినాలు:


సన్‌స్క్రీన్ ప్రొటెక్షన్ డే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: