ఈరోజుకు ఎన్నో ప్రత్యేకతలు.. చరిత్ర తెలిస్తే షాకవుతారు..
ముఖ్య సంఘటనలు
1961 - స్పుత్నిక్ 9 ఉపగ్రహాన్ని ప్రయోగించిన రష్యా .
1959 - బార్బీ డాల్ ను అమెరికన్ ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్లో తొలిసారి ప్రదర్సించారు.
ప్రముఖుల జననాలు
1972: ఆర్. పి. పట్నాయక్, తెలుగు సినీ సంగీత దర్శకుడు, నటుడు, రచయిత, చిత్ర దర్శకుడు.
1934: యూరీ గగారిన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు. (మ.1968)
1959: జాకీర్ హుస్సేన్, ప్రఖ్యాత తబలా విద్వాంసుడు.
ప్రముఖుల మరణాలు
1935: గణేష్ ప్రసాద్, భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన పొటెన్షియల్ సిద్ధాంతం, వాస్తవ చరరాశుల ప్రమేయాలు, ఫోరియర్ శ్రేణులు, ఉపరితల సిద్ధాంతం అనే గణిత విభాగాలలో ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తి.
1964: కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. (జ.1896).బడగనాడు శాఖకు చెందిన బ్రాహ్మణకుటుంబంలో 1896, జూన్ 13 వ తేదీన రెడ్డి అప్పూరావు, వేంకటలక్ష్మమ్మ దంపతులకు అనంతపురం జిల్లా, హిందూపురం తాలూకా, కిరికెర గ్రామంలో జన్మించాడు. గౌతమస గోత్రుడు. మాధ్యమిక విద్య వరకు హిందూపురంలోని ఎడ్వర్డ్ కారనేషన్ స్కూలులో చదివాడు. తర్వాత బెంగళూరులో మిషన్ స్కూలులో కొంతకాలం చదివి మైసూరులో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడయ్యాడు. మైసూరులో స్వయంకృషితో కన్నడ భాషలో ఛందోవ్యాకరణాలలో నిష్ణాతుడయ్యాడు. ఆ భాషలో కవిత్వం చెప్పనేర్చాడు. మైసూరు సంస్కృత కళాశాలలోని పలువురు విద్వాంసుల సహకారంతో సంస్కృతం నేర్చి వ్యాకరణాది అలంకార సూత్రాలను, ఆయుర్వేదము, జ్యోతిశ్శాస్త్రము, సాముద్రికము, వేదాంతము మొదలైన వేదాంగాలను నేర్చుకున్నాడు. పెనుకొండలోని అసిస్టెంట్ ఇంజనీయరు ఆఫీసులో క్లర్క్‌గా చేరి ఒక సంవత్సరం పనిచేశాడు. తరువాత తండ్రి మరణంతో వంశపారంపర్యంగా వచ్చిన మునసబు ఉద్యోగంలో చేరాడు. ఇతనికి 22వ యేడు వివాహమైంది. ఒక కొడుకు ఒక కూతురు జన్మించిన తర్వాత 32వ యేడు భార్య మరణించింది. ఇతడు తన 68వ యేట 1964, మార్చి 9 న మరణించాడు.
1994: దేవికారాణి, సుప్రసిద్ధ భారతీయ నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1908)
1997: బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (జ.1907).పదకొండు భాషల్లో పండితుడైన గోపాలరెడ్డి అనేక రచనలు కూడా చేసాడు. పరిపాలనాదక్షుడుగా, కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిపదవులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిత్వమే కాక, ఉత్తర ప్రదేశ్కు గవర్నరు గాను, రాజ్యసభ సభ్యుడు (1958-1962) గా కూడా పనిచేసాడు.