ఈ లక్షణాలతో "గుండె పోటు" ని ముందుగానే గుర్తించవచ్చు

Bhavannarayana Nch

హార్ట్ ఎటాక్ (గుండె పోటు ) ఎందుకు వస్తుంది దానికి గల కారణాలు ఏమిటి అనేది తెలుసుకుంటే గుండె పోటు రాకుండా ముందుగానే సమస్యని చక్కబెట్టచ్చు..అయితే గుండె పోటు సమస్య ఉన్న వాళ్ళకి కొన్ని లక్షణాల ద్వారా ఆ ప్రభావాన్ని ముందుగానే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు అది ఎలా అనేది చూద్దాం.

 

ధూమపానం , డయాబెటిస్,  హై బీపీ..మద్యం ఎక్కువగా త్రాగడం  ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉండటం లాంటి సమస్యలతో బాధపడేవారికి గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని  నిత్యం వ్యాయామం చేయడం, కొన్ని కొన్ని ఆహార పదార్ధలని దూరం పెట్టడం వల్ల హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గుతుంది.ప్రపంచంలోనే ఈ జబ్బుతో చనిపోయే వారి సంఖ్య చాలా ఎక్కువ...హర్ట్ ఎటాక్ ముప్పును ఎంత ముందుగా పసిగడితే.. ప్రాణాలు దక్కే అవకాశాలు అంతగా మెరుగవుతాయి.మరి ఎలాంటి లక్షణాల ద్వారా ఈ ముప్పుని పసిగట్టచ్చు చూద్దాం.

 

గుండె బలంగా ఉన్నప్పుడు మాత్రమే రక్తం శరీరం మొత్తానికి సరఫరా అవుతుంది..ఈ సమయంలో రక్తం సరఫరా కోసం ఎక్కువగా శరీరాన్ని అలుపు చేస్తుంది దాంతో శరీరం చల్ల బడి ఎక్కువగా చెమట పడుతుంది.

 

ధూమపానం..మధుమేహం..హై బీపీ..ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉండటం లాంటి సమస్యలతో బాధపడేవారికి గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుంది.దీనిని వ్యాయామాలతో కంట్రోల్ చేయవచ్చు..

 

గుండెలో నొప్పి.. భుజాలు..చంకలో నొప్పి..మెడ.. దవడ భాగాల్లో అసౌకర్యంగా ఉండటం అనేవి హార్ట్ ఎటాక్ లక్షణాలని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌‌కు చెందిన డాక్టర్ కేథరీన్ ర్యాన్ తెలిపారు. సాధారణం కంటే ఎక్కువగా చెమట పట్టడం మొదలైతే.. ఎట్టిపరిస్థితుల్లో హాస్పిటల్ కి వెళ్ళడం చాల ముఖ్యమైన విషయం అంటున్నారు.

 

చాలా మందికి జ్వరం లేకపోయినా సరే చెమటలు పడుతూ ఉంటాయి..ఇది హార్ట్ ఎటాక్ రావడానికి ముందు సూచన.స్త్రీలలో మెనోపాజ్ కారణంగానూ ఇలా జరిగే అవకాశం ఉండటంత...చాలా మంది గుండె పోటు కాదని భావించే అవకాశం ఉంది. అందుకే చెమట పట్టగానే డాక్టర్ ని సంప్రదించడం శ్రేయస్కరం.

 

గుండెకి రక్తం సరఫారా ఒక్కసారిగా ఆగి పోవడం వల్ల వచ్చేదే హార్ట్ ఎటాక్..దీనిని కంట్రోల్ చేయాలంటే కొవ్వు ఎక్కువగా ఉండే పదార్ధాలకి దూరంగా ఉండండి..అంతేకాదు డ్రై ఫ్రూట్స్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి..కనీసం రోజుకి మూడు నుంచీ నాలుగు సార్లైనా సరే గ్రీన్ టీని త్రాగడం మంచిది.

.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: