కడుపునిండా తింటున్నారా.. అయితే ప్రమాదమే?

praveen
ఔషధం అయినా సరే ఓవర్ డోస్ అయితే విషం గా మారిపోతూ ఉంటుంది అని ఎంతో మంది నిపుణులు చెబుతూ ఉంటారు. అందుకే ఏది ఎంత మోతాదులో చేయాలో అంతే మోతాదులో చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యం అని వైద్యులు చెబుతూ ఉంటారు. ఇలా ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు.. ఎన్నో రోగాలను దూరం చేసుకునే అవకాశం ఉంటుందని చెబుతూ ఉంటారు. కానీ అతిగా వ్యాయామం చేస్తే మాత్రం చివరికి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే ఆరోగ్యాన్ని బాగు చేసే మందులు కూడా ఎంత మోతాదులో వేసుకోవాలో అంతే మోతాదులో వేసుకోవాలి ఎక్కువ డోస్ వేసుకుంటే చివరికి ప్రాణం గాల్లో కలిసి పోద్ది.

 అయితే ఇదే నియమం  అటు తిండి విషయంలో కూడా వర్తిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆహారం ఎంతో ముఖ్యం  ఆహారం లేకుండా మనిషి బ్రతకగలడా అంటే అసాధ్యము అని చెప్పాలి. అయితే ఆహారం విషయంలో కూడా ఒక పరిమితి ఉంటే మంచిది అని నిపుణులు చెబుతూ ఉంటారు. కొంతమంది ఆహార ప్రియులు ఇక ఇష్టమైన ఆహారం కనిపించింది అంటే చాలు కడుపునిండా లాగించేస్తూ  ఉంటారు. ఎంతలా అంటే ఇంకొక ముద్ద కూడా లోపలికి వెళ్లదేమో అన్నట్లుగా ఫుల్లుగా తినేస్తూ ఉంటారు. హమ్మయ్య ఎంత సంతృప్తికరంగా తిన్నామో అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా తినడం అస్సలు మంచిది కాదు అంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు.

 ఇష్టమైన ఫుడ్ కళ్ళ ముందు ఉంటే సుష్టిగా తినడం ఇప్పటికైనా మానుకుంటే మంచిది అని చెబుతున్నారు  ఎందుకంటే పొట్టను 80% నింపి 20% ఖాళీగా వదిలి చేయాలని చెబుతున్నారు నిపుణులు. అలా చేయడం వల్ల అరుగుదల ఆరోగ్యం బాగుంటాయి అంటూ సూచిస్తున్నారు. పొట్ట పెరిగే సమస్య కూడా తగ్గుతుంది అంటూ చెబుతున్నారు  జపనీలు ఎక్కువగా ఇదే విధానాన్ని అనుసరిస్తూ ఉంటారట. ఆకలి తీరడానికి తప్ప.. కడుపు పూర్తిగా నింపని ఈ ప్రక్రియను జపనీస్ ప్రజలు హర హచి బూగా చెబుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: