వర్షాకాలంలో.. ఆరోగ్యం కోసం ఏ కూరగాయలు మంచివో తెలుసా?

praveen
వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం పై బెంగ మొదలవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆరోగ్యం గా ఉండడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో విధంగా సీజనల్ వ్యాధుల బారిన పడటం చూస్తూ ఉంటాం. దీంతో తినే ఆహారం దగ్గర నుంచి ప్రతి విషయం లోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

 మరీ ముఖ్యంగా వర్షా కాలం లో ఎలాంటి కూరగాయలు తింటే మంచిది అనే విషయం గురించి చాలా మందిలో ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి. సాధారణం గా అయితే డాక్టర్లు ఆకుకూరలు తింటే ఎంతో మంచిది అని చెబుతూ ఉంటారు. అందుకే భోజనం లో ఎక్కువగా ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలని అంటూ ఉంటారు. కానీ వర్షాకాలంలో మాత్రం ఆకుకూరలు కాస్త తక్కువగా తింటేనే మంచిది అని చెబుతూ ఉంటారు నిపుణులు. మరి ఆకుకూరలు తినొద్దు అంటే ఇంకా ఎలాంటి కూరగాయలు తినాలి అనే విషయంపై చాలామందిలో డౌట్స్ ఉంటాయి.

 ఈ విషయంపై డాక్టర్లు ఏమంటున్నారంటే.. సీజనల్గా లభించే వాటిని తింటే ఆరోగ్యం బాగుంటుంది అంటూ చెబుతూ ఉన్నారు డాక్టర్లు. మరి వర్షాకాలంలో ఏ కూరగాయలు మంచిది అంటే న్యూట్రీసియానిస్ట్ లవ్నీత్ బాత్ర మూడు కూరగాయల పేర్లు చెబుతున్నారు. సొరకాయ, కాకరకాయ, మునగకాయ ఈ మూడింటిని కూడా వర్షాకాలంలో తింటే ఎంతో మంచిది అని చెబుతున్నారు. ఇక ఈ మూడింటిలో పుష్కలంగా విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని ఆమె చెప్పుకొచ్చారు. కండరాల మరమ్మతులు, రోగనిరోధక శక్తి పెరుగుదల, చర్మ సౌందర్యం, ఎముకల ఆరోగ్యం లాంటి విషయాలు ఈ మూడు ఉత్తమం అంటూ చెప్పుకొచ్చారు ఆమె. అంతేకాకుండా ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. ఎక్కడ నీటి నిలువ లేకుండా చూసుకోవడం వల్ల దోమల బెడద తక్కువగా ఉంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: