ఉదయాన్నే.. కాఫీ తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి?
ఇక మారిపోయిన ఆహారపు అలవాట్లు కూడా ఎంతోమందిలో అనారోగ్య సమస్యలకు కారణం అవుతూ ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్న ప్రతి ఒక్కరు ఆ ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఏదో ఒక అలవాటును చేసుకోవడం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఎంతో మంది ఒత్తిడిని దూరం చేసుకోవడానికి టీ, కాఫీ తాగే అలవాటు కలిగి ఉంటారో అన్న విషయం తెలిసిందే. చాలామంది ఇలా ఉదయం లేచినప్పటి నుంచి ఒత్తిడి అనిపించినప్పుడల్లా రోజుకి రెండు లేదా మూడుసార్లు టీ లేదా కాఫీ తాగడం చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా కాఫీ తాగే అలవాటును ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అయితే ఇలా కాఫీ తాగే అలవాటు ఉన్నవారికి ఇటీవలే వైద్యులు గుడ్ న్యూస్ చెప్పారు.
చాలామందికి ఉదయం లేవగానే కాఫీ కావాల్సిందే. కాఫీ లేదు అంటే ఇక ఏదో కోల్పోయాము అనే ఫీలింగ్. అయితే సరైన సమయంలో కాఫీ తాగితే వివిధ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు. ఉదయాన్నే కాకుండా కాస్త లేటుగా 9:30 నుండి 11:30 లోపు కాఫీ తాగడం ఉత్తమం అంటూ సూచిస్తున్నారు. అధికంగా ఉండే కాట్రీసాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయని చెబుతున్నారు. శరీరంలోని సహజ హార్మోన్లు మరింత స్థిరంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలిసి కాఫీ తాగే అలవాటు ఉన్నవారు తెగ సంతోష పడిపోతున్నారు.