వీకెండ్ లో ఎక్కువ సేపు నిద్రపోతున్నారా.. అయితే మీకే ఈ గుడ్ న్యూస్?

frame వీకెండ్ లో ఎక్కువ సేపు నిద్రపోతున్నారా.. అయితే మీకే ఈ గుడ్ న్యూస్?

praveen
ఈ మధ్యకాలంలో మనుషులు బాగా లేజీగా మారిపోతున్నారు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికిన హాయిగా నిద్రపోవడానికి ఎక్కువ సమయం కేటాయించడానికి ఇష్టపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళు అయితే ఇక వీకెండ్ ని అదొక  పండగ రోజుగా భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. వారం మొత్తం ఎంతో కష్టపడే ఉద్యోగులు వీకెండ్ వచ్చింది అంటే చాలు రిలాక్స్ అయిపోతూ ఉంటారు. ఎంతలా అంటే కూర్చున్న చోటు నుంచి లేచి టీవీ రిమోట్ తీసుకోవడానికి కూడా బద్దకించెంతలా రిలాక్స్ అవుతూ ఉంటారు. కొంతమంది అయితే ఇక బెడ్ కే అతుక్కుపోతూ ఉంటారు అని చెప్పాలి.

 వీకెండ్ వచ్చిందంటే చాలు ఇక తమ రాజ్యంలో తామే రాజులం అని అనుకుంటూ ఉంటారు. అందుకే ఇక హాయిగా నిద్రపోతూ ఉంటారు. ఉదయాన్నే లేవడానికి చాలా బద్దకిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఏదైనా సరే కాస్త ఎక్కువైతే అది ప్రమాదమే. నిద్ర కూడా అంతే. ఎక్కువ సేపు నిద్రపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతూ ఉంటారు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఎంతోమంది వీకెండ్ లో కుదిరినంత సేపు నిద్రపోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇలా వీకెండ్ అయినా శని ఆదివారాల్లో ఎక్కువ సేపు నిద్రపోయే వారికి ఇప్పుడు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది.

 ఇలా వీకెండ్ లో ఎక్కువసేపు నిద్రపోవడం చాలా మంచిదట. అలాంటి వ్యక్తుల్లో గుండె జబ్బుల ముప్పు 20% తగ్గుతుంది అన్న విషయం ఇటీవల ఒక అధ్యయనంలో వెళ్ళడైంది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ లో ఒక అధ్యయనం నిర్వహించగా ఈ విషయం బయటపడింది. 14 ఏళ్ల పాటు 91,000 మంది డేటాను పరిశీలించి నిపుణులు ఇక ఈ వివరాలను వెల్లడించారు. మనిషికి ఆరు నుంచి ఏడు గంటల నిద్ర అవసరం. కానీ పని ఒత్తిడితో నాణ్యమైన నిద్ర చాలామంది ఉద్యోగులకు దొరకట్లేదు. కానీ వారాంతంలో ఎక్కువసేపు హాయిగా నిద్రపోయి.. దానిని భారతి చేయడం వల్ల ఇలా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని.. ఈ అధ్యయనంలో వెళ్లడైనట్లు నిపుణులు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: