ఆవాలతో అద్భుత ప్రయోజనాలు.. ఇప్పుడే డైట్లో భాగం చేసుకుంటారు...?

praveen
భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేద వైద్యానికి ప్రత్యేక పాత్ర ఉంది. అటువంటి ఆయుర్వేద వైద్యంలో ఆవాలను ఎక్కువగా వినియోగిస్తారని చాలా మందికి తెలియదు. వంటల్లో ఉపయోగించే ఈ ఆవాల వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ఇది జీర్ణక్రియ సమస్యలను దూరం చేస్తుంది. శ్వాసకోశ సమస్యలను తరిమికొడుతుంది. నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ఆవాలు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆవాలలో ఉండే పీచు పదార్థం జీర్ణ ప్రక్రియను సవ్యంగా సాగిపోయేలా చేస్తుంది. చర్మ సమస్యలున్నవారికి ఆవాల ఉపయోగం మరింత ఎక్కువగా ఉంటుంది. సోరియాసిస్‌కు చికిత్స చేయడానికి ఆవాలును ఉపయోగిస్తారని స్వయంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆవాలను ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో ముఖ్యం. మరి ఇటువంటి ఆవాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకోవడం ఎంతో మంచిది.
ప్రతిరోజూ మన ఆహారంలో ఆవాలు ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే ఆవాలను రోజూ తినేవారిలో దంతాల సమస్యలు అంతగా ఉండవని నిపుణులు తెలిపారు. పంటినొప్పితో బాధపడే వారు నీళ్లలో ఆవాలను మరిగించి తాగినా, లేదా పుక్కిలించినా పంటి నొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది. గాయాలపాలైన వారు గాయంపై ఆవాల పొడిని రాస్తే ఆ గాయం త్వరగా తగ్గిపోతుంది.
ఈ మధ్యకాలంలో కీళ్ల నొప్పులతో బాధపడేవారి సంఖ్య బాగా పెరిగింది. చాలా మంది కీళ్ల నొప్పి వల్ల నడవలేని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి ఆవాలు మంచి చేస్తాయి. టీస్పూన్ ఆవాల పొడిలో కర్పూరం కలిపి పేస్టులా చేసుకోవాలి. నొప్పి ఉన్న చోట ఆ పేస్టును రాస్తే నొప్పి మటుమాయం అవుతుంది. కండరాల ఆరోగ్యం కోసం ఆవపిండి బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి వైరస్‌లు, బ్యాక్టీరియాతో పోరాడటానికి ఆవపిండి సహాయపడుతుంది. ఫుడ్ పాయిజనింగ్ వల్ల కడుపు ఉబ్బి బాధపడుతున్నట్లైతే చెంచా ఆవాల పొడిని నీటిలో కలిపి తాగించాలి. అలా చేస్తే కడుపులోని విషపూరిత ఆహారం వాంతి రూపంలో బయటకు వచ్చి కడుపంతా రిలాక్స్ మోడ్ లోకి వెళ్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: