ఇక వేసవి కాలం వచ్చిందంటే చాలు మధ్య తరగతి ప్రేక్షకులు కూడా EMI లో ఏసీ కొంటారు. అయితే చాలా మంది కూడా ఎక్కువ సేపు ఏసీలో ఉంటారు.వేడిని నివారించడానికి చాలా మంది పద్ధతులను అనుసరిస్తారు. కొందరు ఫ్యాన్, మరికొందరు కూలర్లు ఎక్కువగా వాడుతున్నారు. కానీ అవి వాడినా కూడా టెంపరేచర్ తగ్గదు. అందుకే ఈరోజుల్లో ఏసీ వాడకం కూడా బాగా పెరిగిపోయింది. ఎండవేడిమి, ఉక్కపోత కారణంగా ఏసీ వాడకం పెరిగింది. ప్రతిచోటా దీని డిమాండ్ పెరిగింది. అయితే ఎయిర్ కండీషనర్ నుండి వచ్చే గాలి అనారోగ్యానికి గురి చేస్తుందని తేలింది. ఏసీ వాడకం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువ సమయం ACలో గడుపుతున్నట్లయితే, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా దుష్ప్రభావాలను కలిగిస్తుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది మీకు ఖచ్చితంగా అనారోగ్యం కలిగిస్తుందని చెబుతున్నారు. ఎక్కువ సేపు ఏసీలో ఉండటం వల్ల శరీరంలోని తేమ పోతుంది. చర్మం బయటి పొరలో నీటి కొరత ఏర్పడుతుంది.
దీని కారణంగా చర్మం పగుళ్లు ఏర్పడి పొడిగా మారుతుంది. ఎక్కువ సేపు ఏసీలో ఉండటం వల్ల వల్ల చర్మం ముడుచుకుపోతుంది. ముడతలు, గీతలు కనిపించడం ప్రారంభిస్తాయి. వృద్ధాప్యం కూడా వేగంగా పెరుగుతుంది. AC చల్లని గాలి శరీరంలో డీహైడ్రేషన్ సమస్యను కలిగిస్తుంది. ఎయిర్ కండీషనర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల అలర్జీలు, ఉబ్బసం వచ్చే ప్రమాదం ఉంది. AC గాలి కళ్ళు, చర్మంలో దురదను కలిగిస్తుంది. అందువల్ల ఎక్కువ సేపు ఏసీలో ఉండకూడదు.మీరు ఏసీలో ఎక్కువ సమయం గడుపుతున్నట్టయితే.. ‘సిక్ బిల్డింగ్ సిండ్రోమ్’ పెరిగే ప్రమాదం ఉంది. దీని వల్ల తలనొప్పి, పొడి దగ్గు, ఆయాసం, తల తిరగడం, వికారం, ఏ పనిలోనైనా ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు వస్తాయి. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఏసీ వాడకం పూర్తిగా తగ్గించాలని గమనించాలి. ఎక్కువగా ఏసీలో ఉండేవారు తరచూ బలహీనంగా కనిపిస్తుంటారు. పదే పదే నీరసానికి గురవుతుంటారు. వీటిని నివారించాలంటే ఏసీని తక్కువ టెంపరేచర్లో వాడితే మంచిది.