సమ్మర్ వచ్చేసింది. ఎండలు బాగా మండిపోతున్నాయి. ఎండ వేడిమి నుంచి తట్టుకోవడానికి, రిలాక్స్ కావడానికి ఇంట్లో చేసుకునే డ్రింక్స్ చాలా మంచివని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. మనం తీసుకునే వాటర్‌లో షుగర్, సాల్ట్, లెమన్ డ్రాప్స్ కలుపుకొని ఆ మిశ్రమాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని.. బయట నుంచి వచ్చినవాళ్లు రిలాక్స్ కావడానికి ఈ డ్రింక్స్ సహాయపడతాయని న్యూట్రీషన్స్ అంటున్నారు. ఆరు నెలల చిన్నపిల్లల నుంచి వృద్దుల దాకా ఈ డ్రింక్ అందరికీ ఎండాకాలంలో బాగా ఉపయోగపడుతుందని సలహా ఇస్తున్నారు. ఇంకా వీటితో పాటు ద్రాక్షరసంలో కొంచెం చక్కెర, ఉప్పు, నీరు కలిపి తీసుకున్నా సమ్మర్‌లో చాలా మంచిదని నిపుణుల సలహా. లీటర్ వాటర్‌లో కొంచెం అల్లం, పుదీనా రసం, చక్కెర, ఉప్పు కలిపి తీసుకుంటే కూడా చాలా బెటర్ అని అంటున్నారు. లేదా బయట దొరికే కొబ్బరి నీళ్లు, చెరుకు రసం లాంటివి తీసుకున్నా ఎండాకాలంలో చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
మనలో చాలామంది కూడా సమ్మర్‌లో బయటికి వెళ్లి రాగానే గ్లూకోస్ పౌడర్, ఓఆర్ఎస్ లాంటి డ్రింక్స్ చాలా ఎక్కువగా తాగేస్తున్నారు. ఇక ఎండవేడికి శరీరంలోని నీరు అంతా ఆవిరైపోతూ ఉంటుంది.అలాంటప్పుడు బయటకు వెళ్లి రాగానే ఏదో ఒక డ్రింక్ తీసుకోవాలనిపిస్తుంది. అలాంటప్పుడు చాలామంది ప్యాకేజ్డ్ కూల్‌డ్రింక్స్ తీసుకుంటున్నారు. అది మంచిది కాదని న్యూట్రీషియన్స్ సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఈ ప్యాకేజ్డ్ డ్రింక్స్‌లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నవారు ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే బెటర్.. కానీ అందరూ రెగ్యులర్‌గా తీసుకోవడం అంత మంచిది కాదని సూచిస్తున్నారు. గ్లూకోస్ పౌడర్, ఓఆర్ఎస్ లాంటి డ్రింక్స్ కూడా వడదెబ్బ నుంచి త్వరగా కోలుకోవడానికి మాత్రమే తీసుకోవాలని రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది కాదని అన్నారు.ఈ ఎండా కాలంలో ఎక్కడ చూసినా కూడా కూల్‌డ్రింక్స్, కొబ్బరి బొండాలు, లెమన్ వాటర్, ఐస్‌క్రీమ్ లాంటి చల్లటి పదార్థాలు దర్శనమిస్తున్నాయి. అయితే కొబ్బరి బొండాలు, లెమన్ వాటర్ తాగితే ఏం కాదు గాని ఐస్ క్రీం, కూల్ డ్రింక్స్ లాంటి వాటికి మాత్రం చాలా దూరంగా ఉంటే మంచిది.