చియా గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.పొద్దున్నే ఖాళీ కడుపుతో ఇది తింటే కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఉదయం స్మూతీలో వాటిని కలిపి తింటే మంచిది. త్వరగా ఆరోగ్యవంతంగా బరువు తగ్గటంలో ఇది సహాయపడుతుంది.ఉదయాన్నే గుడ్లు తినటం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీంతో మీకు ఆకలి బాధలు తక్కువగా ఉంటాయి. తద్వారా అతిగా తినకుండా ఉంటారు. కాబట్టి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. గుడ్లలో ఐరన్, విటమిన్ డి, పొటాషియం, జింక్ ఉంటాయి. ఇవి మీ శక్తి స్థాయిలను పెంచుతాయి. గుడ్లలో ఉండే అధిక-నాణ్యత ప్రోటీన్ మీ శరీరం ద్వారా సులభంగా జీర్ణమవుతుంది.ఉడకబెట్టినా లేదంటే ఆమ్లెట్‌గా తిన్నా కూడా గుడ్లు చాలా మంచి అనుభూతిని కలిగించే అల్పాహారం.ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గ్రీక్ పెరుగు ఉదయాన్నే తినటం వల్ల పొట్ట నిండుగా ఉంచుతుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచే మంచి ప్రోబయోటిక్ ఇందులో ఉంటుంది. పండ్లు, తేనెతో తింటే మంచిది. పెరుగు ఖాళీ కడుపుతో తినడానికి ఉత్తమమైన ఆహారం. ఇది ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ, బలమైన రోగనిరోధక వ్యవస్థను నిర్వహించడానికి సహాయపడే ప్రోబయోటిక్స్‌తో నిండి ఉంది. గ్రీక్ పెరుగులో కేలరీలు గట్ ఆరోగ్యానికి బాగా తోడ్పడతాయి.
బాదంపప్పులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ రోజును ప్రారంభించడానికి మరింత శక్తిని ఇస్తుంది. బాదంపప్పును సలాడ్ రూపంలో, పచ్చిగా కూడా తినవచ్చు. లేదంటే ప్రోటీన్ షేక్స్‌లో యాడ్ చేసుకున్న సరే. మీరు కాఫీకి ప్రత్యామ్నాయంగా బాదం పాలను కూడా తాగవచ్చు. బాదంపప్పులోని అసంతృప్త కొవ్వు ఓర్పును పెంచడానికి, ఆకలిని అరికట్టడానికి సహాయపడుతుంది. అయితే వాటిలోని అధిక ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువ కాలం సంపూర్ణంగా ఉంచడంలో సహాయపడుతుంది. విటమిన్ E, ప్రోటీన్, ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్, మాంగనీస్, ఫైబర్‌తో నిండిన బాదం మీకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అవుతుంది. కానీ వాటిని రాత్రంతా నానబెట్టిన తర్వాత తినటం మంచిది.ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాపిల్‌ను తింటే ఎక్కువ లాభాలు పొందొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులో ఉండే విటమిన్ సి ని శరీరం త్వరగా గ్రహిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. అధిక రక్తపోటుతో బాధ పడే వారు ఖాళీ కడుపుతో ఆపిల్ తింటే చాలా మేలని అంటున్నారు. గుండె జబ్బులు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది. అంతేకాదు, ఖాళీ కడుపుతో యాపిల్‌ను తింటే మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. శరీరంలో వాపులు తగ్గుతాయి. మెదడు చురుగ్గా పని చేస్తుంది. శరీరం రోజంతా యాక్టివ్‌గానూ ఉంటుంది.