శనివారం నాన్ వెజ్ తినొద్దు అన్నదానికి వెనుక.. సైంటిఫిక్ రీసన్ కూడా ఉందా?

praveen
నాన్ వెజ్ ఆహారం అనగానే ప్రతి ఒక్కరికి కూడా నోరూరిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో అయితే మాంసం ప్రియుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. వారంలో ఒక్కసారి కాదు ఏకంగా రెండు మూడుసార్లు ఇంకా మాంసం తెచ్చుకుని వండుకొని తింటూ ఉంటారు. ఇంకొంతమందికైతే ముక్కలేనిదే ముద్ద దిగదు అన్నట్లుగా కొంతమంది మాంసం ప్రియులు ఉంటారు అన్న విషయం తెలిసిందే.  ఇక వారాంతం వచ్చింది అంటే చాలు మాంసం ప్రియులు ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 సండే పూట ప్రతి ఇంట ఇక ఇలా మాంసం వంటకాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక సండే ముందు రోజైన శనివారం మాత్రం చాలా మంది నాన్ వెజ్ జోలికి వెళ్లరు. దీని వెనుక ధార్మిక కారణాలు ఉన్నాయని అందరూ నమ్ముతూ ఉంటారు. అయితే ధార్మిక కారణాలు మాత్రమే కాదు సైంటిఫిక్ రీసన్ కూడా ఉందట. సాధారణంగా శనివారం అనగానే వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు. కాబట్టి నాన్ వెజ్ తినొద్దు అని అందరూ అనుకుంటారు. కొంతమంది శని మహాత్ముడిని పూజించడం వల్ల శనివారం రోజున నాన్ వెజ్ తినరు  ఇక మరి కొంతమంది ఇక ఆంజనేయస్వామిని పూజిస్తూ నాన్ వెజ్ దూరంగా ఉంటారు. ఇలాంటి కారణాల వల్ల శనివారం చాలామంది నాన్ వెజ్ తినరు అని అనుకుంటూ ఉంటారు అందరూ.

 ఇలాంటి ధార్మిక కారణాలు మాత్రమే కాదు సైన్స్ కూడా శనివారం నాన్ వెజ్ కు దూరంగానే ఉండమని చెబుతుందట. ప్రతి శనివారం భూమిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుందట. వాతావరణం దాదాపు చల్లగా అనిపిస్తుందట. దీంతో మనుషులు జీర్ణక్రియలో అనేక మార్పులు ఉంటాయట. దీంతో ఆరోజు ఎలాంటి హెవీ ఫుడ్ తీసుకున్న.. అది తొందరగా డైజెషన్ కాదట. ముఖ్యంగా నాన్ వెజ్ తీసుకోవడం ఆరోగ్యానికి నష్టం చేస్తుందట. అందువల్లే శనివారం నాన్ వెజ్ జోలికి వెళ్ళవద్దు అనేదానికి  ధార్మిక కారణాలతో పాటు సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: