వామ్మో.. పుచ్చకాయ నిల్వ ఉంచితే.. ఇంత ప్రమాదమా?

praveen
పుచ్చకాయ.. ప్రస్తుతం రోడ్డు మీద వెళ్తున్న షాపింగ్ చేస్తున్న ఇంటి దగ్గర ఉన్న ఇలా ఎక్కడ ఉన్నా కళ్ళ ముందు కనిపించే పండు.  వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి కన్ను  పుచ్చకాయ పైన పడుతుంది. ఇక ఈ పండులో అటు 90% నీరు ఉంటుంది. దీంతో మండు టెండల నుంచి ఇక ఈ పండు తినడం ద్వారా ఉపశమనం పొందాలని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి తో పాటు క్లోరిన్, బీటా కెరొటీన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు కూడా చాలానే ఉంటాయి  ఇక ఇవన్నీ ఎండ తాపం నుంచి రక్షణ కల్పిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 అంతేకాకుండా తరచూ ఎండల్లో తిరుగుతూ ఉండేవారు ఇక పుచ్చకాయ తినడం వల్ల డిహైడ్రేషన్ బారి నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే వడదెబ్బ తగలకుండా ఈ పండు అటు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. అంతేకాకుండా ఇక ఎండాకాలంలో వచ్చే ఎన్నో చర్మ రోగాలు కూడా పుచ్చకాయ తినడం వల్ల తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. దీంతో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరికీ అందుబాటు ధరలో ఉండే ఈ పుచ్చకాయను కొనుగోలు చేసి ప్రతిరోజు తినడం ఒక అలవాటుగా మార్చుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు.

 అయితే తరచూ మార్కెట్ కు వెళ్లి ఎందుకు పుచ్చకాయ కొనడం అని భావించి.. కొంతమంది ఇక పుచ్చకాయను కొనుగోలు చేసి ఇంట్లో ఫ్రిడ్జ్ లో భద్రపరుచుకుని తినడం చేస్తూ ఉంటారు. పుచ్చకాయ పెద్ద ఆకారంలో ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులందరూ తిన్న కూడా ఇంకా మిగిలి ఉంటుంది. దీంతో దానిని ఫ్రిడ్జ్ లో భద్రపరచడం చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ప్రమాదంలో పడినట్లే అని హెచ్చరిస్తున్నారు నిపుణులు  ఫ్రిడ్జ్ లో పుచ్చకాయను భద్రపరచడం వల్ల అందులోని పోషకాలు నశించే అవకాశం ఉంటుంది. 90 శాతం నీరు కలిగిన పుచ్చకాయని ఫ్రిడ్జ్ లో పెడితే అందులోని శీతల ఉష్ణోగ్రత పండు పై ప్రభావం చూపే అవకాశం ఉంటుందట. ఇక కట్ చేసిన పుచ్చకాయలో వేగంగా బ్యాక్టీరియా ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. అలా బ్యాక్టీరియా ఏర్పడిన పండు తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా ఉంటుందట. అందుకే ఇక పుచ్చకాయను ఎక్కువ రోజులు నిలువ ఉంచకుండా త్వరగా తినేయడం మంచిది అని చెబుతున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: