తస్మాత్ జాగ్రత్త.. డాక్టర్ పర్మిషన్ లేకుండా.. ఇలాంటివి అస్సలు చేయొద్దు?
ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా ఏం లాభం ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు అనే విషయం కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. అప్పటి నుంచి అధిక పోషకాలు ఉన్న పదార్థాలు ఔషధాలు తీసుకుంటున్నారు. ఇందులో ఒకటి విటమిన్ డి. ఇది శరీరానికి ఎంతో ముఖ్యమైనది అన్న విషయం తెలిసిందే. అయితే ఇది శరీరానికి ఎంత మేలు చేస్తుందో అధిక మోతాదులో తీసుకుంటే అంతే ప్రమాదకరంగా కూడా మారుతూ ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి విటమిన్ డి అధిక మోతాదులో తీసుకున్నాడు. చివరికి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. యూకే లోని సర్రేలో నివాసం ఉంటున్న డేవిడ్ మిచ్ నర్ అనే 89 ఏళ్ల వ్యక్తి విటమిన్ డి కారణంగా చివరికి ప్రాణాలు కోల్పోయాడు.
అతనికి పోస్టుమార్టం నిర్వహించి రక్త నమూనాలను పరిశీలించగా విటమిన్ డి మోతాదులు తీసుకోవడం కారణంగానే ప్రాణాలు పోయాయి అని వైద్యులు నిర్ధారించారు. ఏకంగా అతని వైద్య పరీక్షల్లో విటమిన్ డి మోతాదు 380 వరకు ఉన్నట్లు తేలింది. అధిక మోతాదులో విటమిన్ డి తీసుకోవడం వల్ల గుండె కిడ్నీ ఫెయిల్ అయ్యాయని వైద్యులు గుర్తించారు. అయితే ఇక ఈ విటమిన్ డి ని ఎంత మొత్తం తీసుకోవాలి అనే విషయం సప్లిమెంట్ ప్యాకెట్ పై ఎలాంటి హెచ్చరికలు లేకపోవడం కారణంగానే అతను ఇలాంటివి చేశాడు అన్న విషయాన్ని కూడా గుర్తించారు అధికారులు. అయితే విటమిన్ డి తీసుకోవడం వల్ల రక్తంలో కాల్షియం పెరుగుతుంది. విటమిన్ డి ఎక్కువైతే అది విషపూరితంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ మధ్యకాలంలో వయసు పైబడిన వారందరూ కూడా విటమిన్ డి తీసుకోవడం రోజువారి అలవాటుగా మార్చుకున్నారు. అయితే ఎంత మోతాదులో తీసుకోవాలి అనే విషయంపై మాత్రం జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.