చూడడానికి చిన్న కాయ అయినా..పోషకాలలో మాత్రం మిన్న..!

Divya
సీజన్ లతో సంబంధం లేకుండా ప్రతి సీజ‌న్‌లోనూ దొరికే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ ఒక‌టి.దొండ‌కాయ‌ను ర‌క‌ర‌కాల కూర‌లు ఉపయోగిస్తుంటారు.కానీ కొంద‌రు మాత్రం దొండ‌కాయ‌ను తిన‌డానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు.కానీ దొండకాయలని సుగుణాలు తెలిస్తే అసలు అలా చేయలేరు.ఎందుకంటే మ‌రెన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను సైతం దూరం చేస్తుంది.అస్సలు దొండ‌కాయ తింటే ఎలాంటి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చో ఇప్పుడు మనము తెలుసుకుందాం పదండీ..ఈ మధ్యకాలంలో ప్రతి పదిమందిలోనూ ఆరు మంది డయాబెటిస్తో బాధపడుతూ ఉన్నారు అలాంటి వారు  దొండ‌కాయ తింటే చాలా మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.ఎందుకంటే,రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గించ‌డంలో దొండ‌కాయ‌ అద్భుతంగా పనిచేస్తుంది.వీరు వారానికి రెండు సార్లనా దొండకాయను వారి ఆహారంలో చేసుకోవడం ఉత్తమం.
 ఇలా తరచూ దొండకాయలు తీసుకోవడం వల్ల ఇందులో అధికంగా ఉన్న క్యాల్షియమ్, మెగ్నీషియమ్ వంటి పోష‌కాలు పుష్కళంగా అంది,ఎముక‌లు, దంతాలు దృఢంగా మార‌తాయి.
 మరియు ఇందులో ఉన్న ఆంటీ బ్యాక్టీరియాల్ గుణాలు, విటమిన్ సి మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి.ఎందుకంటే మనం శరీరంలో రోగనిరోధక శక్తి ఉంటేనే కరోనా వైరస్  మరియు మామూలు సీజనల్ రోగాలకు దూరంగా ఉండవచ్చు.
ఈ కాయలను ఫైబర్ కూడా అధికంగా లభిస్తుంది.కావున దొండకాయను తరుచూ తీసుకోవ‌డంతో జీర్ణ స‌మ‌స్య‌లు న‌యం అవ్వ‌డంతో పాటు, మ‌ల‌బ‌ద్ధకం ,గ్యాస్, అజీర్తి వంటి స‌మ‌స్యల నుంచి కూడా ఉప‌శ‌మ‌నం కలుగుతుంది.
ఇందులో ఉండే అధిక పొటాషియం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జ‌రిగి,గుండె ఆరోగ్యం మెరుగ్గా తయారవుతుంది.బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఇది మంచి ఆహారమని చెప్పవచ్చు.అదికాక శ‌రీరంలో ఉన్న చెడు కొవ్వు క‌రుగుతుంది.మ‌రియు వీటిని తిన్న వెంట‌నే త‌క్ష‌ణ శ‌క్తిగా మారుతుంది.
దొండ‌కాయ‌లో ఉండే బీటా కెరోటిన్లు యాంటీ ఆక్సిడెంట్‌గా మారి,శరీరంలో క్యాన్సర్ కారణమైన ప్రీ రేడికల్స్ పెరగకుండా చేస్తాయి.
కావున ఇన్ని పోష‌కాలు ఉన్న దొండ‌కాయ‌ను ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.అయితే ఆరోగ్యానికి మంచిది క‌దా అని అతిగా మాత్రం అస్సలు తీసుకోకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: