ఈ ఆహారాలతో మధుమేహాన్ని ఈజీగా అరికట్టొచ్చు?

Purushottham Vinay
ఒక్కసారి షుగర్ వ్యాధి వచ్చిందంటే దాన్ని జీవితాంతం అదుపు చేయడం చాలా కష్టం. మధుమేహం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప వచ్చాక తట్టుకోవడం చాలా కష్టం. డయాబెటీస్ ఉన్నవాళ్లు ఏది పడితే అది తినడానికి ఉండదు. డయాబెటీస్ వచ్చిన వారు జీవనశైలిలో కచ్చితంగా మార్పులు చేసుకోవాలి. రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా చూసుకోవాలి. ఆహార విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉండే కార్బోహైడ్రేట్ల విషయంలో కేర్ తీసుకోవాలి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఉన్నటువంటి ఆహారాలు తీసుకున్నట్లయితే రక్తంలో చక్కెర శాతం కంట్రోల్‌లో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండేందుకు.. కొన్ని రకాల ఆహారలు బాగా హెల్ప్ చేస్తాయి. ఆహారం ద్వారానే షుగర్‌ను అదుపులో చేసుకోవాలి. షుగర్ లెవల్స్ పెంచని ఆహారాలు ఖచ్చితంగా తినాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.షుగర్ ఉన్న వారు పాలిష్ చేసిన బియ్యం కంటే పాలిష్ చేయని బియ్యాన్ని తినాలి. అప్పుడే రక్తంలో చక్కెర కలకుండా ఉంటుంది.


 ఆహారాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) అనేది తక్కువగా ఉటుంది. తక్కువ జీఐ ఉన్న ఆహారాలు తింటే గ్లూకోజ్‌ని నెమ్మదిగా రక్తంలోకి విడుదల చేస్తాయి. పాలిష్ చేయని బియ్యంలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా డయాబెటీస్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలంటే.. ఫైబర్ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల ఆహారంలో ఉండే చక్కెర.. రక్తంలో కలవకుండా ఉండేలా చేస్తుంది. కాబట్టి మధు మేహంతో బాధ పడేవారు ఫైబర్ రిచ్ ఫుడ్స్ తినడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.దాల్చిన చెక్కలో షుగర్‌ను నియంత్రించే లక్షణం పుష్కలంగా ఉంది. డయాబెటీస్‌తో బాధ పడేవారు దాల్చిన చెక్క టీ తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇది మీ రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. గోరు వెచ్చటి నీళ్లలో దాల్చిన చెక్క పొడి కలుపుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది. పొట్టలో కొవ్వును కరిగించే రసాయనాలు కూడా దాల్చిన చెక్కలో ఉన్నాయి. కాబట్టి ఇది వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా హెల్ప్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: