ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడు.. రూ.11.67 లక్షల లాభం వచ్చింది?
ముఖ్యంగా కావాల్సినవన్నీ కూడా ఇంటికి డెలివరీ చేయడానికి ఎన్నో ఈ - కామర్స్ సంస్థలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. తినే ఆహారం దగ్గర నుంచి వేసుకొనే చెప్పిన వరకు ప్రతి ఒక్కటి కూడా ఇక ఇంటి వద్దకు డెలివరీ చేస్తున్నారు అని చెప్పాలి. కూర్చున్న చోటు నుంచే తమకు కావాల్సిన వస్తువులు అన్నింటిని కూడా ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకోవడం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ఆర్డర్ చేసిన కొంతమంది కస్టమర్లకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకటి బుక్ చేస్తే ఇంకొకటి డెలివరీ కావడం లాంటివి కూడా జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మాత్రం మరో విచిత్రకరమైన ఘటన జరిగింది. కంపెనీ చేసిన చిన్న పొరపాటు కస్టమర్ కు లాభం కలిగించింది.
11.67 లక్షల విలువైన వజ్రాల చెవి దుద్దులను కార్డియర్ వెబ్సైట్లో గ్లిచ్ కారణంగా మెక్సికోకు చెందిన రోసిలియా అనే వ్యక్తికి 1167 రూపాయలకు మాత్రమే దక్కాయి. ఇక తక్కువ ధర వస్తుంది కదా అని అతను ఏకంగా రెండు జతల చెవిదుద్దులను ఆర్డర్ పెట్టాడు. అయితే ఆ తర్వాత జరిగిన పొరపాటును గమనించిన సదరు సంస్థ వెబ్ సైట్ లో ఇక ఆ ప్రోడక్ట్ యొక్క ధరను మార్చింది. ఏకంగా వాటిని అమ్మేందుకు నిరాకరించింది. దీంతో అప్పటికే బుక్ చేసుకున్న వినియోగదారుడు కస్టమర్ ఫోరం కోర్టును ఆశ్రయించాడు. చివరికి వినియోగదారుల కోర్టు అతనికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇలా సదరూ కంపెనీ చేసిన చిన్న పొరపాటుతో భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు.