ఏంటీ.. కార్ సీట్ కారణంగా కూడా.. సంతాన లేమి సమస్యలు వస్తాయా?

praveen
నేటి రోజుల్లో ప్రతి మనిషి కూడా ఉరుకుల పరుగుల జీవితంలోని ప్రతి రోజును కూడా గడిపేస్తూ ఉన్నాడు. ఇక నేటి ఆధునిక యుగంలో మనిషి జీవనశైలిలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి అని చెప్పాలి. ఇలాంటి మార్పులు కొన్ని కొన్ని సార్లు చివరికి ప్రమాదాలకు కూడా కారణం అవుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఏకంగా నేటి రోజుల్లో ఒకే చోట గంటల తరబడి కూర్చునే ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మనిషికి మానసిక అలసట తప్ప శారీరక అలసట అనేది లేకుండా పోయింది. దీంతో ఎంతోమంది బరువు పెరిగిపోయి స్థూలకాయంతో బాధపడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్.

 ఇక పౌష్టికాహారం తినడం మానేసి రెస్టారెంట్ లో దొరికే బర్గర్లు పిజ్జాలు అంటూ చిత్రపుచిత్రమైన ఆహారం తింటూ ఉండడంతో ఎంతో మంది ఇక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లేవారు. కానీ ఇప్పుడు కార్లో హాయిగా కూర్చుని వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. ఇది దీంతో నేటి రోజుల్లో మధ్యతరగతి వారి దగ్గర నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరు కూడా తమ తహతకు తగ్గట్లుగా కార్లను తెచ్చుకొని వాటిలోని ప్రయాణిస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 అయితే కారులో ప్రయాణించడం వల్ల ఎంతో హాయిగా ఉంటుంది అనుకుంటున్నారు కానీ ఏకంగా ఎక్కువ సేపు కార్ సీట్లో కూర్చుంటే ఊహించని ప్రమాదం కొనితెచ్చుకున్నట్లే అని నిపుణులు చెబుతున్నారు.  కార్ సీట్లో కూర్చోవడం కారణంగా కూడా ఏకంగా సంతానలేమి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోయి సంతానలేమీకి కారణం కారు సీటు కూడా అంటూ ఇటీవల సైంటిస్టులు తేల్చారు. వీర్యకణాల ఉత్పత్తి సక్రమంగా జరగాలంటే పురుషుల శరీరంలోని మిగిలిన భాగాల కంటే వృషణాల వద్ద చల్లగా ఉండాలి. కారు బైక్ సీట్లు అధిక వేడిని విడుదల చేస్తాయి. ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల వృషణాల్లో వీర్యకణాల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. బిగుతైన ప్యాంటు ధరించడం కారణం కూడా ఇలా ఏకంగా  ఎంతోమంది పురుషులు సంతానలేమి సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: