స్మార్ట్ ఫోన్ వల్ల.. వారంలో ఒక రాత్రి నిద్ర గల్లంతు?

praveen
ఇటీవల కాలంలో మొబైల్ వాడకం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మనిషి అవసరాలు తీర్చడానికి వచ్చిన మొబైల్ ఏకంగా ఆరడుగుల మనిషిని ఆడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటీవల కాలంలో అధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో మొబైల్ వాడే వారికి బయట ప్రపంచంతో పని లేకుండా పోయింది. ఎందుకంటే ఏం కావాలన్నా స్మార్ట్ ఫోన్ లోనే దొరుకుతుంది అని చెప్పాలి. దీంతో ఎన్ని పనులున్నా సరే నేటి రోజుల్లో గంటల తరబడి మొబైల్ వినియోగిస్తున్న వారే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఒక్క క్షణం పాటు అరచేతిలో మొబైల్ లేకపోయినా కొంతమంది పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.


 అయితే కొంతమంది కేవలం ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే మొబైల్ చూస్తూ ఉంటే.. ఇంకొంత మంది రాత్రిళ్ళు నిద్ర చెడగొట్టుకుని మరి మొబైల్ వాడటం చేస్తూ ఉన్నారు. తద్వారా ఇక ఎన్నో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఇక మొబైల్ వాడటం ద్వారా ఎన్ని అనర్ధాలు జరుగుతున్నాయి అన్న విషయానికి సంబంధించి ఎన్నో అధ్యయనాలు జరుగుతూ షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇక ఇలాంటివి ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి ఒక షాకింగ్ ఘటన మరోటి బయటపడింది.


 పదేళ్ల లోపే స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వారికి టీనేజ్ లో మానసిక సమస్యలు ఎక్కువగా పెరిగిపోతున్నట్లు వాషింగ్టన్ లోని సపియన్ ల్యాబ్స్ అధ్యయనంలో తేలింది. అయితే యువతుల్లోనే రుగ్మతలు ఎక్కువగా ఉన్నట్లు ఇక ఈ అధ్యయనంలో బయటపడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. చిన్నారులు ఫోన్లో నోటిఫికేషన్లు చూసుకోవడానికి అర్థరాత్రి మేల్కొంటున్నారని.. దీంతో సగటున వారంలో ఒక రాత్రి నిద్ర కోల్పోతున్నారు అంటూ ఇక అధ్యాయం లో వెళ్లడైందట. 41 దేశాల్లో 27,649 మందిపై అధ్యయనం జరపగా.. ఇక ఈ షాకింగ్ విషయం బయటపడినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: