కాకరకాయ రసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..?

Divya
సాధారణంగా కూరగాయలను పచ్చిగా తిన్నా సరే మనకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. తాజా పండ్ల వినియోగం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి మరీ ముఖ్యంగా వేసవి కాలంలో శరీరం కాకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని రకాల పండ్లు కూరగాయల రసాలు తాగడం మంచిది అని వీటిని తాగితే శరీరానికి కావాల్సిన నీటి శాతంతో పాటు అనేక రకాల పోషకాలు కూడా లభిస్తాయి అని వైద్యులు చెబుతున్నారు..
ఇకపోతే కూరగాయల నుంచి తీసిన రసాన్ని మనం తాగితే మరి ముఖ్యంగా కాకరకాయ రసం తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చేతిలో మనకు ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. మరి ముఖ్యంగా ఫైబర్ ,విటమిన్ సి , ప్రోటీన్ , విటమిన్ ఎ,  ఐరన్,  జింక్ మొదలైన పోషకాలకు ఉత్తమమైన మూలం కాకరకాయ అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ కాకరకాయ రసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కాకరకాయ రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది అని చాలా అధ్యయనాలలో చెప్పబడింది. కానీ ఇది ఉపయోగించడం వల్ల అధిక రక్తపోటును కూడా అదుపులో ఉంచవచ్చు పైగా డయాబెటిస్ వారికి మంచి ఔషధం అని చెప్పవచ్చు. అంతేకాదు శరీరంలోని కొలెస్ట్రాల్ ను  తగ్గించడంలో కూడా కాకరకాయ రసం ప్రధమంగా పనిచేస్తుంది. అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణం ఈ కాకరకాయ రసానికి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చేదు రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ నియంత్రణలోకి రావడంతో పాటు అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు.
కాకరకాయ రసంలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందించి జబ్బుల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఏ,  విటమిన్ సి వంటి శక్తివంతమైన ఇలాంటి యాక్సిడెంట్లు కాకరకాయ రసంలో ఉంటాయి. కాబట్టి చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: