ఎలాంటి డైటింగ్ టిప్స్ పాటించకుండా చక్కటి ఆహారాన్ని తీసుకుంటూ మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక డ్రింక్ ని తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా అధిక పొట్టను, స్థూలకాయాన్ని తగ్గించుకోవచ్చు. శరీర బరువును పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును కరిగించే ఆ డ్రింక్ ని ఎలా తయారు చేసుకోవాలి…దాన్ని ఎలా వాడాలి.. వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని తయారు చేసుకోవడానికి మనం ఒక పెద్ద టమాటను, ఒక ఇంచు అల్లం ముక్కను, అర టీ స్పూన్ మిరియాల పొడిని ఇంకా అలాగే అర చెక్క నిమ్మరసాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా మీరు టమాటకాయను ముక్కలుగా చేసుకోవాలి. అలాగే అల్లాన్ని కూడా తీసుకొని దాన్ని దంచాలి.ఇప్పుడు ఈ రెండింటిని ఒక జార్ లో వేసి ముప్పావు గ్లాస్ నీళ్లు పోసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.ఇక ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులో మిరియాల పొడి ఇంకా నిమ్మరసం వేసి కలపాలి.
ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున తాగాలి. అలాగే దీనిని తాగిన గంట దాకా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ విధంగా ఈ డ్రింక్ ని క్రమం తప్పకుండా రెండు నెలల పాటు తీసుకోవాలి. ఈ డ్రింక్ ని తీసుకోవడం మొదలు పెట్టిన 15 రోజుల్లోనే మనం మన శరీరంలో వచ్చిన మార్పును గమనించవచ్చు. ఇంకా అదే విధంగా ఈ పానీయాన్ని తీసుకుంటున్న సమయంలో నీటిని ఎక్కువగా తాగాలి.ప్రతిరోజూ కూడా ఖచ్చితంగా 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. జంక్ ఫుడ్ ను ఇంకా నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. ఈ విధంగా ఈ టిప్ ని పాటించడం వల్ల మనం చాలా సులభంగా ఇంకా అలాగే ఆరోగ్యవంతంగా బరువు తగ్గవచ్చు. అలాగే పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును ఇంకా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కూడా చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ ట్రై చెయ్యండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందవచ్చు.