ఏంటి.. టూత్ పిక్ తో.. సిగరెట్ అలవాటుకి చెక్ పెట్టవచ్చా?
అగ్గిపుల్ల ద్వారా కొవ్వొత్తులను వెలిగించిన సమయాల్లో కొన్ని కొన్ని సార్లు చేతులు కాల్చుకునే ప్రమాదం ఉంది. కాబట్టి కొవ్వొత్తులను టూత్ పిక్ లను ఉపయోగించి ఎంతో సులభంగా వెలిగించవచ్చట.
ఇటీవల కాలంలో కంప్యూటర్ వాడకం అనేది ఎంతో సాధారణమైన విషయంగా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోని కీబోర్డ్ లో కొన్ని కొన్ని సార్లు దుమ్మును శుభ్రం చేయడానికి ఎంతో మంది కష్టపడి పోతూ ఉంటారు. కానీ టూత్ పిక్ ను ఉపయోగించి అటు చిన్న ఖాళీలలో ఉన్న మురికిని సైతం శుభ్రపరచవచ్చు అని చెబుతూ ఉన్నారు.
ఇక మనం జుట్టుతో దువ్వుకోవడానికి ప్రతిరోజు దువ్వెన వాడుతూ ఉంటాం. అయితే ఇలా వాడటం వల్ల దువ్వెన కొన్ని రోజుల తర్వాత మురికిగా మారుతుంది. అలాంటి సమయంలోనే దువ్వెనని శుభ్రం చేయడానికి కూడా టూత్ పిక్ ఉపయోగపడుతుందట.
అంతే కాదండోయ్ ఏకంగా ధూమపానం ఆపడానికి కూడా టూత్ పిక్ ఉపయోగపడుతుంది అన్నది తెలుస్తుంది. కొన్ని ప్రత్యేకమైన రుచులతో కూడిన టూత్ పిక్ లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయట. అయితే ఈ టూత్ పిక్ లను వాడటం వల్ల ఇక ధూమపానానికి క్రమక్రమంగా దూరమయ్యే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.
అయితే చాలామందికి ఇలా టూత్ పిక్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయన్న విషయం మాత్రం తెలియదు. కేవలం టూత్ పిక్ పంటిలో ఇరుక్కున్న ఆహారాన్ని బయటకు తీయడానికి మాత్రమే ఉపయోగిస్తారు అని అందరూ అనుకుంటారు.