నోటి పరిశుభ్రత కోసం ఇలా చెయ్యండి?

Purushottham Vinay
ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యకరమైన ఇంకా అలాగే అందమైన చిరునవ్వును కలిగి ఉండాలని కోరుకుంటారు, ఇది సాధ్యం చేసుకోవాలంటే క్రమం తప్పకుండా నోటి పరిశుభ్రత పాటించాల్సిన అవసరం చాలా ఉంది.ఇంకా అలాగే ప్రకాశవంతమైన చిరునవ్వు మీకు మంచి అనుభూతిని కలిగించడమే కాకుండా, మరింత నమ్మకంగా కనిపించడానికి కూడా తోడ్పడుతుంది. మీ వ్యక్తిగత ఇంకా వృత్తిపరమైన సంబంధాలను ప్రభావితం చేయడంలో మీకు సహాయపడుతుంది. దంత పరిశుభ్రతను మెరుగుపరచడానికి రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవటం చాలా మంచిది. ఇంకా చిరునవ్వును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే ఆరోగ్యకరమైన దంత నియమావళిని తప్పనిసరిగా పాటించటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.ఇంకా అలాగే మీ రోజువారీ నోటి పరిశుభ్రతలో మౌత్ వాష్ కూడా చాలా ముఖ్యమైనది. మౌత్‌వాష్‌ మీ దంత ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. ఇంకా అందమైన చిరునవ్వు మరింత అందంగా కనిపించేలా చేయడంలో మీకు బాగా సహాయపడుతుంది. ఇంకా అంతేకాకుండా కొన్ని ఆహారాలు మీ చిగుళ్ళను బలంగా ఇంకా దంతాలు ఎక్కువ కాలం ఉండేలా చేస్తాయి. చిగుళ్ళు తగినంత బలంగా కనుక లేకుంటే, దంతాలు ఊడిపోతాయి.అందువల్ల, చిగుళ్ళను బలంగా చేయడం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవటం చాలా మంచిది.


విటమిన్ డి లోపం కారణంగా దంతాలు ఇంకా చిగుర్లు ఖచ్చితంగా అనార్యోగం పాలవుతాయి. దంతాలను శుభ్రపరుచుకోవడంలో ఏ మాత్రం ఏమర పాటు అలక్షణ ప్రదర్శించిన బ్లడ్ క్యాన్సర్లు ఇంకా ఎముక కాన్సర్ సంకేతాలు నోటిలో కనిపిస్తాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ సి కలిగి ఉండే నారింజ, ఆకుపచ్చ బెల్ పెప్పర్స్, ట్యూనా ఇంకా అలాగే సాల్మన్ మొదలైన వాటిని ఆహరంలో భాగం చేసుకోవాలి. ఈ ఆహారాలు చిగుళ్ల వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి ఇంకా అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా తోడ్పడతాయి. ఇంకా అదే విధంగా బ్రష్ చేయడానికి ముందు ఫ్లాసింగ్ చేయడం వల్ల ఎక్కువ బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది. దంతాల మధ్య ఇరుక్కున్న ఆహార కణాలు ఇంకా బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి ఫ్లాసింగ్ బాగా సహాయపడుతుంది. ఆ తరువాత బ్రష్ చేయడం వల్ల నోరు మరింత శుభ్రంగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: