షాకింగ్ : ఎత్తు ఎక్కువగా ఉంటే.. ఆ ముప్పు తప్పదట?

praveen
ఇటీవలి కాలంలో ఖాళీగా ఉండడం ఎందుకనో లేదా కొత్త విషయాలను కనుగొనాలనో తెలియదుగానీ ఎంతోమంది వైద్య నిపుణులు శాస్త్రవేత్తలు ఎప్పుడూ వివిధ రకాల సర్వేలు నిర్వహిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి సర్వేలు నిర్వహించిన సమయంలో తెర మీదకి వచ్చే నివేదికలో ఊహించని విషయాలు బయటపడుతూ ఉంటాయి. ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ఇటీవల కాలం లో ఎవరైనా సరే కాస్త ఎక్కువగానే ఎత్తు ఉండాలి అని కోరుకుంటారు అన్న విషయం తెలిసిందే. ఇక కొంత మంది అయితే ఎత్తుగా లేనని పొట్టిగా ఉంటాను అంటూ ఎంతగానో బాధపడిపోతుంటారు. ఎత్తు పెరగడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారూ. టీవీలలో ఏదైనా యాడ్ అనిపించింది అంతే చాలు ఆ ప్రోడక్ట్  కొనుగోలు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు ఎంతో మంది జనాలు. మినిమం సిక్స్ ఫీట్ ఉండాలని అంతకంటే ఎక్కువ ఉన్నా పర్లేదు అని భావిస్తూ ఉంటారు. కానీ ఎత్తు ఎక్కువగా ఉంటే కూడా ఒక ముప్పు పొంచి ఉందన్న విషయం ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

 ఎత్తు ఎక్కువగా ఉండడం వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇటీవలే ఇదే విషయం పై నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడైనట్లు చెప్పుకొచ్చారు. ఎక్కువ ఎత్తు ఉండడంవల్ల నరాలు దెబ్బతినడం చర్మ, ఎముకలు ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అంతే కాదు ఎత్తు ఎక్కువగా ఉన్న వారిలో హృద్రోగ ముప్పు అధిక రక్తపోటు అధిక కొవ్వు లాంటి సమస్యలు కూడా తరచూ వేధిస్తూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: