'మైగ్రేన్' తో నరకం చూస్తున్నారా... ఇలా చేయండి?

VAMSI
మామూలుగా మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కొన్నింటిని మాత్రం తట్టుకోగలము, మరి కొన్ని తట్టుకోలేకుండా ఉంటాయి. అటువంటి వాటిలో మైగ్రేన్ తలనొప్పి ఒకటి అని చెప్పవచ్చు. దీని వలన
 తలలోని రక్త నాళాల మీద ఒత్తిడి పెంచి భరించ లేని తల నొప్పిని తీసుకొస్తుంది. మైగ్రేన్ తో బాధపడేవారు తరచూ తట్టుకోలేనంత తలనొప్పితో బాధపడుతుంటారు. అందులోనూ ఇది ఎక్కువగా ఒక వైపు మాత్రమే భయంకర గా నొప్పి వస్తూ ఉంటుంది. దీనిని భరించడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ మైగ్రేన్ తలనొప్పి పురుషుల్లో కంటే మహిళల్లోనే మూడు రెట్లు అధికంగా ఉంటుంది. గంటల కొద్దీ వేధించే ఈ తలనొప్పిని తగ్గించడం కోసం రకరకాల మాత్రలు మరియు ఎవరు పడితే వారు చెప్పే ఆయుర్వేద చిట్కాలను వాడుతూ ఉంటారు. అయినప్పటికీ ఈ మైగ్రేన్ తలనోపి నియంత్రణలోకి రాదు.

అయితే మైగ్రేన్ నుండి విముక్తి  పొందడానికి కొన్ని ఇంటి చిట్కాలను పాటించమని చెబుతున్నారు నిపుణులు.  ఇంతకీ అవేంటో తెలుసుకుందాం పదండి.

* కప్పు వేడి నీటిలో బ్లాక్ టీ కలుపుకుని అందులో పుదీనా ఆకులు వేసుకుని తరచూ తాగితే మంచి ఫలితం ఉంటుంది.

* అలాగే అల్లం, నిమ్మ రెండింటి రసాలను సమపాలనలో కలిపి రోజూ రెండు పూటలా కొద్ది రోజులు తాగాలి.

* తలనొప్పి వచ్చినప్పుడు పుదీనా లేదా అల్లం రసాన్ని నుదుటిపై మర్దన చేస్తూ రాసుకోవాలి.
 
* తలనొప్పి వచ్చిన సమయంలో మెడ, తలపైన ఐస్ ప్యాక్ ను ఉంచుకున్నా ఉపశమనం కలుగుతుంది.

* మైగ్రేన్ తో బాధపడే వారు ఎక్కువ నడుస్తుండాలి. కనీసం ఒకటి రెండు కిలోమీటర్లు అయినా నడుస్తూ ఉంటే మంచిది. ఇలా నడవడం వలన బాడీ లోని అన్ని నరాలు ఆక్టివ్ అయ్యి మిమ్మల్ని కొంచెం తాజాగా చేస్తుంది. తద్వారా తలనొప్పి నుండి కోలుకునే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: