రాత్రిపూట ఫోన్ వాడితే.. ఈ వ్యాధి వస్తుందట.. తస్మాత్ జాగ్రత్త?
అయితే ఇటీవలి కాలంలో అటు ఎంతో మంది జనాలు నిద్రని కూడా దూరం చేసుకుని మొబైల్ ఫోన్ వాడకం లాంటివి చేస్తూ ఉన్నారు. పగలు మొత్తం మొబైల్ వాడింది సరిపోదు అన్నట్లుగా ఇక రాత్రి సమయంలో కూడా మొబైల్ ఫోన్ వాడటం టీవీల ముందు కూర్చోవడం లాంటివి చేస్తున్నారు. ఇక మరికొంతమంది లాప్ టాప్ లు కూడా వాడటం లాంటివి చేస్తూ ఉండటం నేటి రోజుల్లో ఎక్కువైపోతుంది. అయితే ఇలా రాత్రి సమయంలో అధికంగా లాప్ టాప్ మొబైల్ ఫోన్లు టీవీ చూడటం లాంటివి చేసే వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలా రాత్రి సమయంలో నిద్రను దూరం చేసుకుని లాప్టాప్, టీవీలు, సెల్ఫోన్లు వాడడం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. ఇటీవల నిర్వహించిన పరిశోధనలో మరో షాకింగ్ విషయం కూడా బయటపడింది. రాత్రి వేళలో అధికంగా మొబైల్ వాడటం వల్ల మొబైల్ ఫోన్ లోనే బ్లూ లైట్ వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి తీవ్రమై టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. రాత్రిపూట ఎక్కువగా ఎలక్ట్రానిక్ పరికరాలు వాడేవారికి ఈ ప్రమాదం పొంచి ఉందని పరిశోధనల్లో స్పష్టమైందట. బ్లూ లైట్ నిద్రను తగ్గిస్తుందని.. శరీరంలోని ఇన్సులిన్ నిరోధకత చర్యలకు దారితీస్తుంది అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.