రష్యాను వణికిస్తున్న కరోనా.. పుతిన్ కీలక..!

MOHAN BABU
రష్యాలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. కోవిడ్ వెలుగుచూసిన అప్పటినుండి రికార్డు స్థాయిలో 40 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. రోజు వారి కరోణ కేసులు భారీగా పెరుగుతున్నండడం వలన  ఆంక్షలు కఠినతరం చేశారు. కరోణ నియంత్రణకు దేశ అధ్యక్షుడు పుతిన్ వారం పాటు దేశవ్యాప్తంగా ఉద్యోగులకు పెయిడ్ హాలిడే ను ప్రకటించారు. ప్రజలు వ్యాఖ్యను తీసుకోకపోవడం వల్లే వైరస్ వ్యాప్తి చెందిందని వాదనలు వినిపిస్తున్నాయి. రాజధాని మాస్కోలో మాత్రం ఉద్యోగులకు శుక్రవారం నుంచి పెయిడ్ హాలిడే ప్రారంభమైంది. వైరస్ కట్టడి లో భాగంగా మాస్కోనగరం లో పాఠశాలలు, రెస్టారెంట్లు, క్లబ్బులు, వినోదానికి సంబంధించిన వాటన్నింటినీ మూసివేశారు.


కేవలం ఆహారం, మందులు, నిత్యావసర వస్తువుల దుకాణాలు మాత్రమే తెరిచేందుకు అనుమతినిచ్చారు. మ్యూజియంలు,థియేటర్లకు పరిమిత సంఖ్యలో వ్యాక్సిన్ వేసుకున్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకొని వారు ఇళ్లకే పరిమితం అయ్యేలా చూడాలని అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. ప్రపంచంలో తొలి వ్యాక్సిన్ ను తయారు చేసినట్లు ప్రకటించిన రష్యా టీకా పంపిణీలో మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే వెనుకంజలో ఉంది. దీనికి వ్యాక్సినేషన్ మందగించడం వల్లే కొత్త కేసులు, మరణాలు పెరుగుతున్నాయని అధికారులు ఆరోపిస్తున్నారు. దేశ జనాభాలో మూడింట ఒక వంతు మందికి మాత్రమే  అంటే14.6 మందిలో 4.9 కోట్ల రష్యన్ లకు మాత్రమే టీకాల పంపిణీ జరిగింది. దాదాపు 19 నెలల అనంతరం  సరిహద్దులను తెరిచేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లే పౌరులు కఠిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది.  తమ పౌరులు177 దేశాలకు వెళ్లేందుకు విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగం అనుమతించింది. టీకా రెండు డోసులు తీసుకున్న వారిని  అర్హులు గా ప్రకటించింది. ప్రపంచంలో ఏ దేశం పాటించినటువంటి అత్యంత కఠినమైన లాక్ డౌన్ ను ఆస్ట్రేలియా అమలు చేసింది.


 సింగపూర్లో కరోనా ఉప్పెనలా విరుచుకు పడుతోంది. అక్కడ తాజాగా 5324 కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో ఇప్పటి వరకు అక్కడ నమోదైన కేసుల సంఖ్య లక్ష 84వేల 419 కి చేరింది. మహమ్మారి ధాటికి మరో పది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 349 కి చేరింది. అసాధారణంగా కరోణ కేసులు పెరగడాన్ని నిశితంగా గమనిస్తున్నట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: