స్పుత్నిక్ లైట్.. ఎగుమతి సిద్ధం..!

Chandrasekhar Reddy
రష్యా రూపొందించిన స్పుత్నిక్ లైట్ భారతదేశంలో ఉత్పత్తి ప్రారంభం అయిన విషయం తెలిసిందే. దానిని ఇతరదేశాలకు ఎగుమతి చేసే అవకాశం లేదా అనుమతి ఇప్పటికి వచ్చింది. అయితే దీనిని అత్యవసర వినియోగానికి కూడా భారత్ లో ఆమోదించకపోవడంతో ఇతరదేశాలకైనా దానిని అందించడానికి భారత్ పూనుకుంది. దీనితో అనుమతి కోరగా తాజాగా కేంద్రం జారీ చేసింది. రష్యా కు 40 లక్షల డోసుల ఎగుమతికి భారత ఔషధ సంస్థ హెటెరో బయో ఫార్మా లిమిటెడ్ అనుమతి ఇచ్చింది. దీనిని ఏప్రిల్ లోనే అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ విభాగం అనుమతి పొందింది. ఈ స్పుత్నిక్ లైట్ రష్యా రూపొందించిన స్పుత్నిక్ వి కంపోనెంట్ 1 మాదిరే ఉంటుంది. అందుకే దీనిని కూడా కరోనా వాక్సిన్ లలో చేర్చారు.
ఇప్పుడు రష్యా లో కరోనా విజృంభిస్తుంది అందుకే అక్కడి రాయబారి భారత్ ను స్పుత్నిక్ లైట్ ఎగుమతి చేయాలని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎగుమతి చోటుచేసుకుంది. స్పుత్నిక్ వి ఒక మిలియన్, స్పుత్నిక్ లైట్ రెండు మిలియన్ డోసులను హెటెరో సంస్థ ఉత్పత్తి చేసిందని, కేంద్రానికి రష్యా రాయబారి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇక భారత్ లో వాడకం ఎలాగూ అనుమతి లేదు, ఇంకా ఉత్పత్తి నిల్వ ఉంచితే పనికి రాకుండా పోతుందనే ఉద్దేశం తో రష్యా ఈ మేరకు ఎగుమతి చేయాల్సిందిగా భారత్ ను కోరింది.  మొదటి విడతగా 40 లక్షల స్పుత్నిక్ లైట్ అందుకు సిద్ధం చేశారు.
గత నెల నుండి రష్యా లో కరోనా కేసులు అలాగే మరణాలు కూడా విపరీతంగా చోటుచేసుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా మరణాలు రోజుకు 900 పైనే ఉంటున్నాయి. దీనితో అక్కడ ఇప్పుడిప్పుడే మరిన్ని కరోనా నిబంధనలు  కఠినంగా అమలు  చేస్తున్నారు. గత కొంత కాలంగా కరోనా ప్రజలు కరోనా జాగర్తలు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా గుంపులు గుంపులుగా తిరగటం వలన ఈ తరహా విజృంభణ పరిస్థితి వచ్చిందని అక్కడ వైద్య అధికారులు అంటున్నారు. ఇప్పటి పరిస్థితిని బట్టి మరో రెండు నెలలు ఈ స్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వాక్సిన్ పంపిణి కూడా నెమ్మదిగా జరుగుతుండటం మరో కారణంగా చెపుతున్నారు. ఇప్పటికి 33శాతం కూడా వాక్సినేషన్ ప్రక్రియ పూర్తికాలేదని వారు చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: