కన్నీళ్ల ద్వారా కొవిడ్ వ్యాప్తి..?
కాగా, ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. అమృత్సర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఇటీవల చేసిన ఓ అధ్యయనం ప్రకారం కొవిడ్ పేషెంట్స్ కన్నీళ్ల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తున్నదన్న విషయం తేలింది. కరోనా రోగుల్లో కంటి పరిస్థితి బాగాలేకపోయినా, వారి కంటి నుంచి వచ్చే కండ్ల కలక స్రావాల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందని అంచనా వేస్తున్నారు. ఇండియన్ జర్నల్ ఆప్తాల్మాలజీ ఎడిషన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం..కొవిడ్ ప్రభావం కంటి ప్రమేయంతో లేదా కన్నీళ్లతోనూ ఉండొచ్చని తెలిపారు పరిశోధకులు. కొవిడ్ వల్ల కలిగే ‘ఓక్యులర్ మానిఫెస్టేషన్’ ద్వారా కరోనా పాజిటివ్ రోగుల కన్నీళ్ల లో ప్రాణాంతకర వైరస్ ఉనికిని అంచనా వేయొచ్చని పరిశోధకులు వివరించారు. కన్నీళ్లు సోకిన ఉపరితలాన్ని తాకడం వల్ల కూడా వైరస్ వ్యాపిస్తుందని పరిశోధకులు తెలిపారు.
ఇక అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే.. కరోనా వైరస్ ఇప్పటి వరకు దగ్గు, తుమ్ము ద్వారా వ్యాపిస్తుందనుకుంటుండగా, ఆ జాబితాలోకి మరొక లక్షణం చేరిందనే చెప్పొచ్చు. ఈ క్రమంలోనే కొవిడ్ పాజిటివ్ పేషెంట్స్ కొవిడ్ సోకినపుడు కళ్లు రుద్దడం మానుకోవాలని నిపుణులు తెలిపారు. ఇక ఆల్రెడీ మాస్కును మస్ట్‌గా యూజ్ చేసే క్రమంలో పొరపాటునైనా మాస్కు తీయొద్దట. జనసమ్మర్థం ఉండే ఏరియాస్‌లో ఫిజికల్ డిస్టెన్స్‌ను మస్ట్ గా పాటించాలి. వ్యాక్సిన్ తీసుకోవడం కూడా కంపల్సరీ. ఇక కొవిడ్ పేషెంట్స్ కొవిడ్ బారి నుంచి బయటపడినప్పటికీ మాస్కు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలి అని నిపుణులు తెలియజేస్తున్నారు.