గర్భిణీలు తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు..

Purushottham Vinay
గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటేనే పుట్టే పిల్లలు చాలా ఆరోగ్యంగా వుంటారు. ఇక గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా ఈ ఆహార పదార్ధాలు తీసుకోవాలి. ఇవి తీసుకోవడం వల్ల వారికి పుట్టే పిల్లలు చాలా పుష్టిగా ఆరోగ్యంగా వుంటారు. గర్భిణీలు ఖచ్చితంగా రోజుకి ఐదారు మీల్స్ తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్, మిడ్ మార్నింగ్ స్నాక్, లంచ్, ఈవెనింగ్ స్నాక్, డిన్నర్ ఇలా రాత్రి నిద్రకి ముందు  ఇలా తీసుకోవాలి.ప్రతి ఆహారం బ్యాలెన్స్డ్‌గా ఉండేలా చూసుకోవాలి. ధాన్యాలు,చపాతీ ఇంకా రైస్ తో పాటు పరాథా అలాగే మిల్లెట్ దోసె మరియు బజ్రా దోసె ఇంకా దాలియా, పోహా, ఉప్మా తీసుకోవాలి.ఇంకా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఖచ్చితంగా డైట్‌లో తీసుకుంటూ ఉండాలి. బోన్ డెన్సిటీ ఇంకా మజిల్స్‌కి ప్రోటీన్స్ అనేవి చాలా అవసరం.ఇంకా అదే విధంగా బీన్స్, గుడ్లు, పల్లీలు వంటివి ఆహారంలో ఎక్కువగా తీసుకోని తినాలి.అలాగే వాటితో పాటుగా నట్స్ వంటివి కూడా తింటూ ఉండాలి.


ఇంకా ఖచ్చితంగా డైట్‌లో కూరగాయలు ఇంకా పండ్లు అనేవి చాలా ఎక్కువగా ఉండేటట్లు తీసుకోవడం మంచిది. ఇవి అనేక రకాల సమస్యలను నయం చేస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.ప్రతి సీజన్‌లో వచ్చే పండ్లు కూరగాయలు కూడా తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. ఇది నిజంగా గర్భిణీలకు చాలా మంచిది.పొటాషియం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అదే విధంగా తినే ఆహారంలో సాల్ట్‌ని తగ్గిస్తూ ఉండాలి. సాల్ట్‌ని తక్కువగా తీసుకోవడం వల్ల హైబీపీ రిస్కు అనేది ఉండదు.ఇంకా పండ్లు, కూరగాయలు, బీన్స్, ఫ్యాట్ లేని డైరీ ప్రొడక్ట్స్ లాంటివి కూడా తీసుకుంటూ ఉండటం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే వీటిలో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.ఇక ఫైబర్ కూడా తినే డైట్‌లో ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి.గర్భిణీ స్త్రీలకు హృదయ సంబంధిత సమస్యలు అనేవి రాకుండా ఇది ఎంతగానో సహాయ పడుతుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్ రిస్క్‌ని కూడా తగ్గిస్తుంది.తినే ఆహారంలో ఖచ్చితంగా బీన్స్, నట్స్, ఓట్స్ లాంటి ఆహారం పదార్ధాలు ఎక్కువగా వుండేటట్టు చూసుకొని తినండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: