గుండెకు.. గుమ్మడి చేసే మేలు ఎంతో తెలుసా?

Divya

గుమ్మడికాయను ఎక్కువగా మనం నర దోషాలను నివారించడానికి మాత్రమే ఉపయోగిస్తాము. అయితే ఈ గుమ్మడి కాయ కేవలం నర దోషాలను మాత్రమే పోగొట్టకుండా, నరుడి ఆరోగ్యానికి కావలసిన అన్ని పోషకాలను అందిస్తుంది. ముఖ్యంగా గుమ్మడి కాయ తినడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్స్,మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ లు  పుష్కలంగా అందుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుమ్మడికాయను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే చర్మ సంబంధిత వ్యాధులను మొదలుకొని డయాబెటిస్ ను వరకు ఇలా ఎన్నో జబ్బులను నయం చేస్తుంది. ఇందులో ముఖ్యంగా విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె తో పాటు పొటాషియం, పాస్ఫరస్,ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం వంటి మినరల్స్ కూడా ఉన్నాయి. అందుకే రోజూవారి ఆహారంలో గుమ్మడికాయను చేర్చుకోవడం మంచిదని అంటున్నారు నిపుణులు.

ఇందులో ఉండే పీచు, విటమిన్ సి గుండెకు రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తాయి. అంతేకాదు ఇందులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని పదిలం చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ ఉండడంవల్ల నేత్ర సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. అందుకే చదువుకునే పిల్లలకు గుమ్మడికాయను ఎక్కువగా తినిపించాలి.

ఇక తల్లి కావాలనుకునే వారికి గుమ్మడి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి కావాల్సిన ఇనుమును అందించి, సంతాన సాఫల్యతను పెంచుతుంది.గుమ్మడి కాయ తినడం వల్ల బరువు తగ్గడం, షుగర్ కంట్రోల్ అవడం, ఆస్తమాను నివారించడం, శ్వాస కోశ సంబంధిత వ్యాధులను నయం చేయడం లాంటి పనులను సమర్థవంతంగా చేస్తుంది.

మహిళల్లో  వచ్చే అసాధారణ బ్రెస్ట్ క్యాన్సర్ కు సంబంధించి, మెనోపాజ్ దశలో అడుగుపెట్టిన మహిళలు గుమ్మడి గింజలు తింటే చాలా మంచిది. హార్మోన్స్  అసమతుల్యత సమస్య నుంచి ఉపశమనం అందిస్తుంది.అంతే కాకుండా బరువు తగ్గాలనుకునే వారు కూడా గుమ్మడి కాయలను పుష్కలంగా తినవచ్చు. ఇక డయాబెటిస్ ని కూడా కంట్రోల్ చేసే శక్తి గుమ్మడికాయకు ఉంది. కాబట్టి గుమ్మడి కాయతోపాటు గుమ్మడి గింజలను  కూడా ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: