కరోనా చికిత్సకు హైదరాబాదీ డ్రగ్..అద్భుతమైన ఫలితాలు..అనుమతులకోసమే వెయిటింగ్.!

MADDIBOINA AJAY KUMAR
దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుతోంది. కేసుల సంఖ్య పెరగటం తో పాటు మరణాల సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది . అయితే కరోనా వచ్చి ఏడాది దాటినా ఇప్పటికీ సరైన మందు లేకపోవడం బాధాకరం . ఇతర వ్యాధులు ఉపయోగించే మందులను ఉపయోగించే కరోనా తీవ్రతను తగ్గిస్తున్నారు. ఈ క్రమంలో ఆ మందులు కూడా దొరకడం లేదు . ఒక్క సరిగా కేసుల సంఖ్య పెరగటంతో మందులు సరిపోవడం లేదు. అయితే ప్రస్తుతం కరోనా మధ్యస్థ, స్వల్ప లక్షణాలను తగ్గించే ఔషధమ్ "మోల్నూ పిరవిల్" మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు హైదరాబాద్ కు చెందిన ఫార్మా కంపెనీలు సిద్ధమవుతున్నాయి .
ఈ ఔషధాన్ని ఇన్ఫ్లుయింజా చికిత్సలో ఉపయోగిస్తారు. అయితే కరోనా ను తగ్గించడానికి "రీపర్పసింగ్" పద్ధతిని ఉపయోగిస్తున్నారు . ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఫార్మా నాట్కో మూడో దశ క్లినికల్ పరీక్షలు నిర్వహించడానికి రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే ఈ మందును సీరియస్ గా ఉన్న పేషంట్ లకు అందించేందుకు ప్రయత్నిస్తోంది. అనుమతుల కోసం సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కు దరకాస్తు చేసింది. అంతే కాకుండా ఇప్పటి వరకు రెండు దశల్లో క్లినికల్ ట్రైయల్స్ నిర్వహించగా సత్ఫలితాలు వచ్చాయని సంస్థ పేర్కొంది . అంతే కాకుండా నోటి ద్వారా అందించే చికిత్స కావడం వల్ల రోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపింది. ఈ ఔషధం ద్వారా చికిత్స అందించినప్పుడు ఐదు రోజుల్లోనే సత్ఫలితాలు కనిపించాయని చెబుతోంది . కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఔషధానికి సీడీఎస్సీఓ ఖచ్చితంగా అనుమతులు ఇస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ఓ వేళ అనుమతులు లభిస్తే నెల రోజుల్లో ఔషధాన్ని విడుదల చేస్తామని సంస్థ పేర్కొంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: