వేసవికాలంలో జీర్ణ సమస్యలు రాకుండా ఉండాలంటే... ఈ చిట్కాలు ట్రై చేయండి...
వేసవికాలంలో అన్నము సరిగా తినకపోవడం వల్ల నీరసంగా ఉంటుంది. అంతేకాకుండా అన్నం తినకుండా ఎవరికి నచ్చిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కడుపులో మంట, ఆకలి వేయకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే తీసుకునే ఆహారం సరిగా జీర్ణం కాక పోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. చెవిలో వేడి ఎక్కువగా ఉండటంవల్ల, తినే ఆహారంలో మార్పుల వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. జీర్ణసమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను ఉపయోగించాలి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
వేసవికాలంలో జీర్ణ సమస్యలు రాకుండా ఉండడానికి ఎక్కువగా ఫైబర్ వున్న పండ్లు, పప్పు ధాన్యాలు, బీన్స్, చిక్కులు తీసుకోవాలి. అలాగే కేలరీలు తక్కువగా ఉన్నా ఆహారాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా భోజనము తక్కువగా తినాలి. వేసవిలో దొరికే పుచ్చకాయ, దోసకాయ వీటితో పాటు ఆపిల్, పైనాపిల్ వంటి వాటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంకా ప్రోటీన్లు, ఫైబర్ క్యాల్షియం, విటమిన్లు ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది.
వేసవికాలంలో నీరు ఎక్కువగా తాగడం వల్ల బద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా కొబ్బరి నీళ్ళు కూడా తాగడం వల్ల శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తాయి
ఎండాకాలంలో ఫాస్ట్ ఫుడ్ ను తగ్గించడం చాలా మంచిది. అలాగే మసాలా ఫుడ్డు ను చాలావరకు తగ్గించుకోవాలి. వీటిని తినడం వల్ల కడుపులో మంట, కడుపుబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా బేకరీ ఐటమ్స్ తీసుకోకపోవడం మంచిది.
వేసవిలో పెరుగు తీసుకోవడం వల్ల క్రియ సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే తెలుగులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా విరేచనాలు కూడా తగ్గిస్తుంది.
వేసవికాలంలో రోడ్డు పక్కన ఫుడ్డు తినకపోవడం మంచిది. ఎందుకంటే ఇది ఫుడ్ పాయిజన్ అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ ఇంటిలో చేసిన ఆహారాలను తీసుకోవడం మంచిది.
రోజు ఉదయం లేవగానే వ్యాయామాలు, వాకింగ్, జాగింగ్, యోగా, స్విమ్మింగ్, ఏరోబిక్స్ వంటివి చేయడం చాలా మంచిది.