ఈ ఆరోగ్య చిట్కాలు అద్భుతంగా పని చేస్తాయి... వీటిని ఫాలో అవ్వండి...

kalpana
 ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అలా జరగదు. ఎందుకంటే మనం తినే ఆహారం అంతా  మంచిది కాదు. ఏదో తినాలని తింటూ ఉంటాం కానీ అందులో  శరీరానికి కావలసిన ప్రోటీన్లు, పోషకాలు ఉన్నాయో లేదో గమనించరు.  ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అలాగే చిట్కాలను ఉపయోగించడం వల్ల  కొన్ని అనారోగ్య సమస్యలను తగ్గించవచ్చు. చిట్కాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం...

 డయాబెటిస్ ఉన్న వాళ్ళు నేరేడు పండ్లు తినడం వల్ల మంచిది. ఈ పండ్లలో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మలబద్దక  సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే అరటిపండు గుజ్జును తీసుకొని అందులో కొంచెం చింతపండు, ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల రక్తవిరేచనాలు తగ్గుతాయి. జలుబు  ఎక్కువగా ఉన్నప్పుడు విటమిన్ సి  ఉండే ఆహారాలు తీసుకోవాలి.

 ఎండలో ఎక్కువగా తిరిగి వచ్చిన వారు మామిడికాయ ముక్కలను ఉప్పు వేసుకొని తినడం వల్ల తక్షణ  శక్తి వస్తుంది. బంగాళదుంప పై కనిపించే ఆకు  పచ్చని మచ్చలపై సెలె సైన్  అనే విష పదార్థం ఉంటుంది.  అందుకే ఆకుపచ్చని మచ్చలు ఉన్న బంగాళదుంపను తినకూడదు.

 ఒక కప్పు నీటిలో రెండు టీస్పూన్లు తేనె కలుపుకొని పడుకునే ముందు తాగితే మంచి నిద్ర పడుతుంది. మూత్ర సమస్యలు ఉన్న వాళ్ళు అరటిపండు తినకపోవడం మంచిది.

 తేనెటీగలు కుట్టినప్పుడు వాటిపై బిల్లగన్నేరు ఆకులను పెట్టడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే గజ్జి, తామర వంటి సమస్యలు ఉన్నప్పుడు అనాస పండు రసాన్ని తీసుకుని వాటి పై పూతగా రాయాలి. ఇలా చేయడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి.

 ఎక్కిళ్ళు ఆగకుండా వస్తుంటే కొంచెం పంచదార నోట్లో వేసుకోవడం వల్ల ఎక్కిళ్ళు ఆగిపోతాయి. కొన్ని కరివేపాకు ఆకులను పరగడుపున నమిలి తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

 శరీరంలో అధికంగా వేడి ఉంటే సబ్జా గింజలను వేడి నీటిలో నానబెట్టి పాలలో కలిపి మధ్యాహ్నం పూట తాగితే శరీరంలో వేడి తగ్గిపోతుంది. ధనియాలను తీసుకొని నోట్లో  వేసుకొని చప్పరిస్తూ ఉంటే నోటి దుర్వాసన పోతుంది.

 నరాల బలహీనత ఉన్న వాళ్ళు మామిడి పండ్ల రసం లో ఒక స్పూన్  తేనె కలుపుకొని తాగడం వల్ల నరాల బలహీనత తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: