మహిళలు రెగ్యులర్ గా కాఫీ తాగితే పిల్లలు పుట్టరా...?
ఆండ్రోజన్ హార్మోన్ ఎక్కువగా విడుదలైతే పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఈ క్రమంలో ఇన్సులిన్ మోతాదు ఎక్కువై ఆండ్రోజన్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా పీసీఓఎస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పీసీఓఎస్ సమస్య ఉన్న వారి అండాశయాల్లో నీటి తిత్తులు ఏర్పడి అండాల విడుదలను అడ్డుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ సమస్య ఉన్నవారిలో పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల అసమతుల్యత వల్ల కొంత మంది మహిళ్లలో నెలసరి క్రమంగా రాదు. ఫలితంగా అండం విడుదల జరగదు. దీంతో.. అండాశంలో చిన్నచిన్ననీటి బుడగలు ఏర్పడతాయి. దీనినే పీసీఓడీ (పాలిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. ఈ సమస్యకు పూర్తి స్థాయిలో కచ్చితమైన కారణాలు చెప్పలేమని అంటున్నారు వైద్య నిపుణులు. ఐతే.. ఆహార అలవాట్లు, జన్యుపరమైన అంశాలతోపాటు హార్మోన్ల అసమతుల్యత వంటివి ప్రధాన కారణాలు అని భావిస్తుంటారు.
హర్మోన్ల అసమతుల్యత వల్ల నెలసరి సక్రమంగా రాదు. నెలసరి సమయంలో ఎక్కువ బ్లీడింగ్ జరుగుతుంటుంది. పీరియడ్స్ సమయంలో కడుపులో నొప్పిగా అనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. ఇక.. పీసీఓఎస్, పీసీఓడీ సమస్యలుండే వారిలో కొంత మంది బరువు విపరీతంగా పెరగుతారు. కొంత మందికి అకారణంగా జుట్టు రాలిపోతుంటుంది. మరి కొంతమందికి శరీరంపైన, ముఖంపైన, ఛాతీపైన జట్టు వస్తుంది. దీనినే ‘హిర్సుటిజం’ అంటారు.పురుషుల్లో ఉండాల్సిన ఎండ్రోజన్ హార్మోన్ స్త్రీలలో ఉత్పత్తి అవడంతో ఈ సమస్య వస్తుంది. ఇక.. ఉన్నట్టుండీ అలసటగా అనిపిస్తుంటుంది. మూడ్ స్వింగ్స్ కనిపిస్తుంటాయి. విసుగు, చికాకు ఎక్కువగా కనిపిస్తాయి
పీసీఓఎస్, పీసీఓడీకి తోడు స్థూలకాయం వంటి సమస్యలుంటే చాలా ప్రమాదం. అందుకే బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డైట్ కంట్రోల్, శారీరక శ్రమ, వ్యాయామం, యోగా వంటివి తప్పనిసరి. శరీర బరువు తగ్గే కొద్దీ హర్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది. కంటి నిండా నిద్ర ఉండాలి. రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి. సంగీతం వినడం, పాటలు పాడడం వంటివి హాబీగా పెట్టుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
పీసీఓఎస్, పీసీఓడీ సమస్య ఉన్నవారి శరీరంలో చక్కెర స్థాయి అధికంగా ఉంటుంది. అందుకే ఇటువంటి వారు పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారం జోలికి వెళ్ల కూడదు. ప్రతి రోజూ పోషకాహారం తీసుకోవాలి. విటమిన్లు, ప్రొటీన్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్‌ను మెనూలో యాడ్ చేయాలి. విటమిన్ - బి లోపం ఉన్నవారిలో పీసీఓఎస్ సమస్య వచ్చే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది. అందుకే చేపలు, గుడ్లు, ఆకుకూరలు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది. వెన్న, డార్క్ చాక్లెట్, ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలుంటే ఆహారం తీసుకోవడం ద్వారా హార్మోన్లు సమతులం అవుతాయి. ఫలితంగా నెలసరి సక్రమంగా వస్తుంది.
పీసీఓఎస్ సమస్య ఉన్నవారు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటే మంచిది.పీసీఓఎస్‌తో సతమతమయ్యే వారు కాఫీ తాగితే సమస్య మరింత ముదిరే ప్రమాదం ఉందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.
ప్రతి రోజూ ఓ చెంచాడు కోకోనట్ ఆయిల్‌ని ఆహారంలో భాగంగా చేసుకుంటే పీసీఓఎస్ సమస్యను తగ్గే అవకాశం ఉంది.ప్రతి రోజూ గ్రీన్ టీ తాగితే హార్మోన్ల అసమతుల్యత సమస్య తగ్గుతుందట. ఉదయాన్నే పరగడుపున కలబంద రసం తాగితే అండాశయాల పనితీరు మెరుగుపడుతుందట.