ఇంట్లో వాడే కుకింగ్ గ్యాస్ ద్వారా పిల్లల్లో ఆస్తమా వస్తుందా..?

Divya

పిల్లల్లో ఆస్తమా రావడానికి, ఇంట్లో వంట గ్యాస్ ను ఉపయోగించి కుకింగ్ చేయడానికి  మధ్య సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా..! అవునండీ.. ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ద్వారా  ఇంట్లో వంట గ్యాస్ ద్వారా కుకింగ్ చేయడం వల్ల, అందులో నుండి వెలువడే కొన్ని రసాయనిక వాయువులు పిల్లలకు ఆస్తమాను కలిగిస్తున్నాయని తేలింది.

కట్టెల పొయ్యితో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, కట్టెలు కాలిన తరువాత బొగ్గుగా మారి, అందులో నుండి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ లాంటి హానికర వాయువులు వెలువడుతున్నాయి. అందువల్ల కట్టెల పొయ్యి  ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు ఒక అధ్యయనంలో వెల్లడించారు. ఇప్పుడు అదే అధ్యయనాలు గ్యాస్ స్టవ్ ద్వారా వెలువడే వాయువులు కూడా హానికరం అని చెప్తున్నాయి. అసలు గ్యాస్ స్టవ్ పైన కుకింగ్ చేయడం ఎందుకు హానికరం..? అందులో నుండి ఎలాంటి వాయువులు వెలువడతాయి..? వీటివల్ల పిల్లలకు ఎలాంటి ప్రభావం కలగనుంది..? అనే అంశాల గురించి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

సాధారణంగా గ్యాస్ బర్నింగ్ ద్వారా అనేక వాయువులు ఉత్పత్తి అవుతాయి. ఇందులో కొన్ని సాపేక్షంగా ప్రాణాపాయం కలిగించవు. మరికొన్ని వాతావరణంలో మార్పులు..అంటే గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలు, గ్యాస్ స్టవ్ వంటి దేశీయ పరికరాలలో ఉత్పన్నమయ్యే సహజవాయువులు దాదాపు అన్నీ మీథేన్ అలాగే ఇతర హైడ్రోకార్బన్లు అయిన ఈథేన్ ను వినియోగిస్తారు. ఇంటిలో నత్రజని, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులు వినియోగిస్తారు.సాధారణంగా సహజ వాయువుకు సమర్థవంతంగా మండే స్వభావం కలిగి ఉంటుంది. సహజవాయువును కాల్చడం ద్వారా ప్రతి కిలో గ్రామ్ కు 34 గ్రాముల కార్బన్ మోనాక్సైడ్,79 గ్రాముల నత్రజని ఆక్సైడ్లు, 6 గ్రాముల సల్ఫర్ డై ఆక్సైడ్ విడుదల అవుతాయి.

ఇక ఇదే విషయంపై  నెదర్లాండ్  లో జరిగిన ఒక అధ్యయనంలో పిల్లలలో ఉబ్బసం వచ్చే ప్రమాదంతో, గ్యాస్ వంటకు సంబంధం ఉందని  నిరూపించబడింది. గ్యాస్ ఉపయోగించబడే  ఇంట్లో నివసించే పిల్లలకు ప్రస్తుతం ఉబ్బసం వచ్చే ప్రమాదం 42 శాతం ఉండగా, జీవితకాలంలో అది 24 శాతం ప్రమాదం ఉందని తెలిసింది. అదే విధంగా ఆస్ట్రేలియాలో కూడా జరిగిన ఒక అధ్యయనంలో 7 నుంచి 14 ఏళ్ల మధ్య పిల్లల 80 గృహాల్లో అధ్యయనం చేయగా, గ్యాస్ స్టవ్ వాడకం వల్ల ఆస్తమా వచ్చే అవకాశం ఉందని రుజువైంది. గ్యాస్ స్టవ్ లేని గృహాల పిల్లల్లో ఆస్తమా కంటే, గ్యాస్ స్టవ్ వాడే గృహాల పిల్లలు ఆస్తమాతో రెండు రెట్లు అధికంగా బాధపడుతున్నారు. గ్యాస్ కుక్కర్ లు ఇంటిలోనే నైట్రోజన్ డయాక్సైడ్ ను పెంచడం వల్ల,  పిల్లలు ఆస్తమా వల్ల రాత్రి సమయం ఇన్హేలర్ ల వాడకం ఎక్కువగా ఉంది.
కాబట్టి ఇంట్లో గ్యాస్ స్టవ్ కుకింగ్ చేసేటప్పుడు, చుట్టుపక్కల వెంటిలేషన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీని ద్వారా విషవాయువులు బయటకు వెళ్లి, అనారోగ్య సమస్యలకు దారితీయవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: