ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు టైం వేస్ట్ చేస్తున్నట్లే..!

kalpana
సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో సమయం అనేది ఎంతో ముఖ్యమైనది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ 24 గంటలే ఉంటాయి. కానీ కొందరు ఆ సమయాన్ని ఎంతో ముఖ్యమైనదిగా ఉపయోగించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.కానీ మరికొందరు మాత్రం వారు సమయం వృధా చేసుకుంటున్నారని తెలిసినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తుంటారు. అయితే ఈ లక్షణాలు కనుక మీలో కనిపిస్తే మీరు కచ్చితంగా సమయం వృధా చేస్తున్నట్లే... అయితే ఆ లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...                             

* ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు చేతులలో ఎల్లప్పుడు ఫోన్ పట్టుకొని యూట్యూబ్, ఫేస్ బుక్ ద్వారా వీడియోలను చూస్తూ ఆనందంగా ఉన్నారంటే కచ్చితంగా మీరు కాలాన్ని వృధా చేస్తుంటారు. అయితే మరికొంతమంది యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు అలాంటి వారికి ఇది వర్తించదు.
*  కొంతమంది ఎంతో శ్రద్ధగా ఒక పనిచేయడానికి శ్రీకారం చుట్టి మధ్యలోనే ఆ పని వదిలేసి వెళ్తుంటారు.

*ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు పదేపదే నాది తప్పు కాదని కప్పిపుచ్చుకోవడం, అదేవిధంగా మన దగ్గర కొన్ని వందల కథలు ఉన్న దేనిని చదవకుండా ఉండటం.

* సాధారణంగా మిమ్మల్ని కలవడానికి ఎవరైనా వచ్చేటప్పుడు వారికి సమయం ఉన్నప్పుడు వస్తున్నారంటే మీ సమయానికి వాల్యూ లేదని అర్థం.

* ఏదైనా చిన్న చిన్న ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు వాటిని చేయడానికి మన పై ఒత్తిడి చేస్తున్నారంటే మన జీవితంలో మనం సరైన మార్గంలో లేమని అర్థం.

*చాలామంది ఎటువంటి పనులు చేయకుండా టైం వేస్ట్ అవుతుందని తెలిసిన దాని గురించి ఎక్కువగా బాధపడుతుంటారు. ప్రస్తుతం ఈ పరిస్థితులలోనే చాలామంది ఉంటూ వారి సమయాన్ని వృధా చేస్తున్నారు. ఈ లక్షణాలు గనుక మీలో కనిపిస్తే కచ్చితంగా మీరు సమయాన్ని వృధా చేసినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: